తెలంగాణ

హృదయం..పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: యశోద ఆసుపత్రిలో ఓ రోగికి గుండె మార్పిడి కోసం సోమవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన లైవ్ గుండెను నగర పోలీసులు గ్రీన్ చానల్ ద్వారా తరలించారు. కేవలం 30 నిమిషాల్లో 35 కిలోమీటర్ల మేరకు ఎలాంటి అడ్డంకుల్లేకుండా తీసుకొచ్చారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక వైద్యాధికారుల బృందంతో వచ్చిన ‘గుండె’ను సకాలంలో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నాం 12 గంటల 33 నిమిషాలకు ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో గుండెను తీసుకుని బయల్దేరిన ఈ వాహనం ఎక్కడా ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా పోలీసులు పక్కా ఏర్పాట్లు చేసి విజయవంతంమయ్యారు. 30 నిమిషాల్లో సికిందరాబాద్ యశోద ఆసుపత్రికి సురక్షితంగా తీసుకువచ్చారు. హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో గ్రీన్‌చానెల్‌ను అమలు చేసి ప్రశంసలు అందుకున్నారు.

చిత్రం..శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లైవ్ గుండెను తరలించిన అంబులెన్స్