తెలంగాణ

ఇంటర్ ఫస్టియర్‌కు ఎథిక్స్, ఎన్విరాన్‌మెంటల్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: ఇంటర్ ఫస్టియర్‌కు ఎథిక్స్, హ్యుమన్‌వాల్యూస్ - ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలను ఈ నెల 28, 31వ తేదీల్లో నిర్వహించనున్నట్టు ఇంటర్మీటియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 10 నుండి ఒంటి గంట వరకూ జరుగుతుందని చెప్పారు. ఈసారి పరీక్ష పత్రాలను ఆన్‌లైన్‌లో పంపిస్తామని, పరీక్షకు అర్ధగంట ముందు వాటిని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని విద్యార్థులకు ఇవ్వాలని, పరీక్ష అనంతరం వాటి మార్కులను సైతం ఆన్‌లైన్‌లోనే జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్ అప్‌లోడ్ చేయాలని ఆయన చెప్పారు. విద్యార్థుల హాల్‌టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఉంచామని, వాటిని డౌన్‌లోడ్ చేసి ప్రిన్సిపాల్స్ విద్యార్థులకు అందజేయాలని తెలిపారు.