రాష్ట్రీయం

ఐఏఎస్‌ల కోర్టు ధిక్కారం కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: కోర్టు ధిక్కారం కేసు కింద హైకోర్టు సింగిల్ జడ్జి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఐఎఎస్ అధికారులకు విధించిన జరిమానా, శిక్షలను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మార్కెటింగ్ శాఖ కమిషనర్ శరత్, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్, మహబూబ్‌నగర్ కలెక్టర్ శ్రీదేవి తమపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టు ధర్మాసనం వద్ద పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు మార్కెటింగ్ కమిషననర్ శరత్‌కు ఐదు వేల రూపాయల జరిమానా, ఈ జరిమానా చెల్లించని పక్షంలో ఏడు రోజుల సాధారణ జైలు శిక్షను సింగిల్ జడ్జి విధించారు. గుడిమల్కాపూర్‌లో కూరగాయల కమిషన్ ఏజెంట్ల సంక్షేమ సంఘం ఇచ్చిన వినతిపత్రం అనుసరించి వారి డిమాండ్లను ఆమోదించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సింగిల్ జడ్జి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను పాటించనందుకు జరిమానాను విధిస్తున్నట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా పోచారం గ్రామంలో రోడ్డు అవరోధాలు తొలగించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ అమలు చేయలేదనే కారణంపై ఇదే కోర్టు కలెక్టర్‌కు రూ. 1116 జరిమానాను విధించింది. జరిమానాను చెల్లించని పక్షంలో రెండురోజుల సాధారణ జైలు శిక్షను అనుభవించాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక కేసులో హైకోర్టు ఆదేశాలను పాటించనందుకు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ టి కె శ్రీదేవికి రూ. 1116 జరిమానాను విధించారు. ఈ మూడు కేసుల్లో ముగ్గురు ఐఎఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లను విచారించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే సింగిల్ జడ్జి కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.