తెలంగాణ

శ్రీ విద్యాధరి క్షేత్ర మహత్యం చాలా గొప్పది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఫిబ్రవరి 10: ప్రసిద్ద వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్ర మహత్యం చాలా గొప్పదని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. ఆదివారం వసంత పంచమి మహోత్సవం సందర్బంగా శ్రీ విద్యాధరి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకరభారతి తీర్థ స్వామీజి ఆశిస్సులు పొందిన అనంతరం ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడారు.
స్వల్పవ్యవదిలోనే ఆలయ ప్రశస్త్యం నలు దిశలా వ్యాపించి లక్షలాది మంది భక్తుల ఇలవేల్పుగా ప్రసిద్దికెక్క గా, దినదిన ప్రవర్దమానమవుతున్న శ్రీ విద్యాధరి, శ్రీ శనైశ్చర, శ్రీ లక్ష్మి గణపతి ఆలయాలకు తరలివస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని క్షేత్ర వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్దాంతి నేతృత్వంలో వసతుల కల్పన, ఏర్పాట్లు అమోఘమని ప్రశంసించారు. ఆలయ అభివృద్ది కి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతాన మల్లిఖార్జున క్షేత్ర వ్యవస్థాపకులు డాక్టర్ చెప్పెల హరినాథశర్మ, వేద పండితులు అనంతగిరిశర్మ, శశిధరశర్మ, నాగ రాజశర్మ, ప్రవీన్‌కుమారశర్మ, గణేష్‌శర్మ, వంశీశర్మ, రామశర్మ, సంతోష్ శర్మ, ఆలయ కమిటీ నిర్వాహకులు నర్సింహరావు, సత్యనారాయణ, వెంకటకృష్ణ, విశ్వనాథం, రఘురామచందర్, ఇర్రి మల్లారెడ్డి, గంగిషెట్టి సుదాకర్, నూక బిక్షపతి, అత్తెల్లి బాపిరాజు, ఎన్‌బీ ప్రభాకర్, టేకులపల్లి బాల్‌రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి పాల్గొన్నారు.