తెలంగాణ

దళం నుంచి దళపతి స్థాయి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, ఫిబ్రవరి 11: నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల కేంద్రానికి చెందిన మావోయిస్తు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అ పార్టీ మిలటరీ కమిషన్ ఇంచార్జి, జార్ఖ్‌ండ్ రాష్ట్ర ఇంచార్జి సట్వాజీ అలియాస్ సుధాకర్ అలియాస్ కిరణ్ తన మూడున్నర దశాబ్దాల అజ్ఞాత ఉద్యమ జీవితానికి స్వస్తిపలకడం మావోయిస్టుపారీని కలవరపాటుకు గురి చేసింది. గత వారం రోజుల క్రితం సట్వాజీ తన భార్య నీలిమ అలియాస్ మాధవితో కలిసి జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో పోలీసులకు లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీలో కీలక సభ్యుడైన సట్వాజీపై కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయ రివార్డును ప్రకటించగా ఆయన భార్య మాధవిపై రూ 25లక్షల రివార్డు ఉంది. జార్ఖండ్ పోలీసులు సట్వాజీ, ఆయన భార్య నీలిమను హైదరాబాద్ తరలిస్తునట్లు సమాచారం నేడో రేపో రాష్ట్ర పోలీసుశాఖ ఉన్నత సట్వాజీ లొంటుబాటు ప్రకటించనునట్లు తెలుస్తుంది. కాగా సట్వాజీ ఉద్యమ ప్రస్థానం 1984 నుండి క్రీయాశీలకంగా మారినట్లు సమాచారం. అంతకు ముందు ఆయన రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో పని చేసి క్రీయాశీల ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. అప్పటి పిపుల్స్‌వార్‌పార్టీ రాష్ట్ర కమిటీ కొరియర్‌గా పనిచేసి అ పార్టీ సీనియర్ నాయకులకు సన్నిహితుడయ్యారు. కొరియర్‌గా ఉంటూనే 1986లో కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో ఆరెస్టు అయ్యారు. 1989లో జైలు నుంచి విడుదల అయిన సుధాకర్ కొద్ది రోజులు అప్పట్లో పీపుల్స్‌వార్‌పై నిషేదం ఎత్తివేయడంతో బహిరంగ పార్టీ కార్యకలాపాలు చేపట్టారు. అందులో భాగంగానే నిర్మల్‌లో అమరవిరుల భారీ స్థూపంను నిర్మింప చేశారు. 1999 పీపుల్స్‌వార్‌పై పోలీసు నిర్బంధం పెరగడంతో ఆయన తిరిగి ఆడవి బాటపట్టారు. 1992లో చెన్నూర్ దళ కమాండర్‌గా, తరువాత సిర్పూర్ దళకమాండర్‌గా పని చేశారు. 1992లో పీపుల్స్‌వార్‌పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో తనకున్న నాయకత్వపటిమతో సంక్షోభంలోని పార్టీని గట్టెకించారు. 1993లో పీపుల్స్‌వార్ పార్టీ జిల్లా సభ్యుడిగా అ తరువాత జిల్లా కార్యదర్శిగా పని చేశారు. 1995లో ఎన్‌టీ జైడ్‌టీ సభ్యునిగా కొనసాగారు. కొంత కాలం పాటు ఏవోబీ దళంలో కూడా పని చేయడమే కాకుండా అప్పటి అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడి కేసులో కూడ సట్వాజీ పాల్గొనట్లు అప్పట్లో పోలీసులు తెలిపారు. తరువాత సట్వాజీ 2009 నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా నియమింపబడ్డారు. అ బాధ్యతతో పాటు సీ ఎంసీ సభ్యుడిగా అలాగే జార్ఖండ్ రాష్ట్ర ఇంచార్జిగా పార్టీ హైకమాండ్ ఆయనను నియమించింది. ఇలా ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన 25 ఏళ్ల పాటు పీపుల్స్‌వార్ పార్టీలో పని చేసి అనేక సంఘటనలకు నేతృత్వం వహించాడని చెబుతున్నారు. ఆయనపై సిర్పూర్ (యూ) పోలీసు స్టేసన్ పేల్చివేత, నర్సాపూర్ పోలీసు స్టేషన్ పేల్చివేత సింగరేణిలో సీఐఎస్‌ఎఫ్ బెటాలియన్‌లపై దాడులు చేసి ఆయుధాల అపహరణ లాంటి కేసులు నమోదు చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులను హతమర్చిన సంఘటనల్లో ఆయన ప్రమేయం ఉనట్లు అరోపణలు ఉన్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో అప్పటి డీసీసీబీ అధ్యక్షుడు రమేష్‌రెడ్డిని కాల్చిచంపిన సంఘటన కూడా సట్వాజీ మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు సమాచారం. సుధాకర్ 35 ఏళ్ల అజ్ఞాత ఉద్యమ జివితానికి తెరపడింది.