తెలంగాణ

శిల్పారామంలో భారీ సాంస్కృతికోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: హైదరాబాద్‌లోని శిల్పారామంలోని నైట్ బజార్‌లో ఈ నెల 14 నుండి 17 వరకు ‘ఆక్టేవ్’ పేరుతో భారీ ఎత్తున గ్రామీణ నృత్యాలు, క్రాఫ్ట్ మేళా నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, టూరిజం శాఖ కార్యదర్శి బి. వెంకటేశం తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. మహారాష్టల్రోని నాగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నేతృత్వంలో బృహత్ సాంస్కృతిక ఉత్సవాలు జరుపుతున్నామన్నారు. ఈ ఉత్సవాల్లో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొంటున్నారు. అలాగే మణిపూర్, అస్సాం, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం, సిక్కిం రాష్ట్రాలకు చెందిన గ్రామీణ నృత్యాల ప్రదర్శన కూడా ఉంటుంది. నాలుగు రోజుల సాంస్కృతిక పండగలో పాల్గొనే కళాకారులు హైదరాబాద్ రావడం ఇప్పటికే ప్రారంభమైంది. వీరికి వౌలిక వసతులు కల్పిస్తున్నామని, ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెంకటేశం వివరించారు. సాంస్కృతిక ఉత్సవాలకు తోడుగా టెక్స్‌టైల్ (దుస్తులు) అమ్మకాలు, వెదురుకర్రలతో చేసిన వస్తువులు, డ్రైఫ్లవర్స్ తదితర గ్రామీణ ఉత్పత్తుల అమ్మకం ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.