తెలంగాణ

కేసీఆర్ కృషికి సహకరించేందుకు విద్యుత్ ఉద్యోగులు సైనికుల్లా మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తెలంగాణ పునర్ నిర్మాణానికి, రాష్ట్భ్రావృద్ధికి విద్యుత్తు ఉద్యోగులు సైనికుల్లా పని చేయాలని ట్రాన్స్‌కో సీఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు పిలుపునిచ్చారు. ఇంటిని, పని చేసే కార్యాలయాన్ని రెండింటినీ సమానంగా చూసుకుంటు వృత్తిలో కొనసాగాలని ఆయన సూచించారు. సోమవారం విద్యుత్తు సౌదలోని ఆడిటోరియంలో ప్రభాకర్‌రావును ఇంజనీర్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో విద్యుత్తు ఇంజనీర్లు 600 పుస్తకాలను ఆయనకు బహుకరించారు. వీటిని బీసీ కమిషన్ సభ్యులు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలురు గౌరీశంకర్, ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. శివాజి చేతుల మీదుగా ఆ పుస్తకాలను ప్రభాకర్ రావుకు అందజేశారు. అనంతరం సీఎండి ప్రభాకర్ రావు ప్రసంగిస్తూ ఇప్పుడు నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తున్నంనదున ప్రజల కష్టాలు గట్టెక్కుతాయని అన్నారు. కృష్ణా, గోదావరి నదులను దక్కన్ పీఠభూమిపై అనుసంధానం చేస్తూ హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే భగీరథ ప్రయత్నాలకు మనమంతా కార్యకర్తల్లా పని చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో పాల్గొని మన జన్మలను ధన్యం చేసుకుందామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిరంతరం శ్రమ చేసి విద్యుత్తు రంగాన్ని తీర్చిదిద్దిన కృషిలో ప్రతి విద్యుత్తు ఉద్యోగ బాధ్యత ఉందని ఆయన తెలిపారు.
తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు జూలురు గౌరీ శంకర్ మాట్లాడుతూ ప్రభాకర్ రావుకు ఉన్న నిబద్ధత, అంకితమైన భావంతో పని చేసే తర్వాన్ని ప్రతి ఒక్క ఉద్యోగి అలవరచుకోవాలన్నారు. విద్యుత్తు ఉద్యోగులు బహుమానంగా ఇచ్చిన 600 పుస్తకాలను తన స్వగ్రామమైన బోర్నపల్లి గ్రంథాలయానికి అందిస్తానని ప్రభాకర్ రావు చెప్పడం చాలా బాగుందని ఆయన తెలిపారు. ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. శివాజి మాట్లాడుతూ విద్యుత్తు రంగాన్ని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ప్రభాకర్ రావు తరహాలో కృషి చేయాలని అన్నారు. ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ కార్యదర్శి బి. మధుసూదన్ రెడ్డి, ట్రాన్స్‌కో సెక్రటరీ బి. రవి, భద్రయ్య, లింగమూర్తి, వెంకట్రామయ్య, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.