తెలంగాణ

ప్రతి ఇంటిపై బీజేపీ జెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణలో ప్రతి ఇంటిపై బీజేపీ జండా ఎగురవేసేందుకు పార్టీ కృషి చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ చెప్పారు. ముందుగా పార్టీ అభిమానులు తమ ఇళ్లపై జండాను ఎగరవేస్తారని అన్నారు. నవభారత నిర్మాణానికి మరోసారి మోదీ ప్రధాని కావాలన్న ప్రచారం చేపడతామని, ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయంపై విస్తృత ప్రచారం చేస్తామని చెప్పారు. బీజేపీ సిద్ధాంత కర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బలిదాన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణ్‌తో పాటు నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతా సాంబమూర్తి, జి ప్రేమేందర్ , పాపారావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ సమాజానికి, దేశానికి ఆర్థిక రూపంలో గానీ ఇతర విధాలుగా గానీ వీలైనంత వరకూ తమ సహాయం అందించేందుకు జాతీయ వాదులు,దేశ భక్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచన మేరకు ఈ నెల 15వ తేదీ వరకూ విరాళాల సేకరణ చేపడుతున్నామని తెలిపారు. యాప్‌ద్వారా ఇచ్చిన నిధులకు రసీదు వెంటనె వస్తుందని, మైక్రో నిధుల సేకరణలో ప్రతి పౌరుడూ భాగస్వామ్యం కావాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మోదీని ప్రధానిని చేసేందుకు ప్రతి ఒక్కరూ పది రోజుల సమయం కేటాయించేలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చే యువతను గుర్తిస్తున్నామని అన్నారు. దేశం కోసం తనను తాను సమర్పించుకున్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ తమ జీవితమంతా జనంతో జనసంఘ్‌తో ముడిపడి ఉందని, ఆయన సాధారణమైన జీవితాన్ని గడిపారని అన్నారు. కార్యకర్తలను సిద్ధాంతపరంగా తయారుచేయడంతో పాటు విలువలతో కూడిన రాజకీయాలను ఎలా నడపాలో ఆచరించి దారి చూపిన వ్యక్త అని అన్నారు. సేవా భావంతో రాజకీయాలను నడపాలనే వారికి దీన్ దయాళ్ జీ ఓ స్ఫూర్తి ప్రధాత అని, వారి స్ఫూర్తిలో యువత రాజకీయాల్లోకి రావల్సి ఉందని అన్నారు. పేదల్లోని నిరుపేదలు ముందుగా లబ్ది పొందాలని అంత్యోదయ సిద్ధాంతాన్ని ప్రవచించారని, ప్రధాని నరేంద్రమోదీ ఆ అంత్యోదయ సిద్ధాంతంతో పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. 70 సంవత్సరాల్లో ఆరు కోట్ల 25 లక్షల మరుగుదొడ్లు నిర్మిస్తే గత నాలుగేళ్లలో 10 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడారని అన్నారు. ఉజ్వల గ్యాస్, సుకన్య సమృద్ధి యోజన, నిరుపేదలకు పెన్షన్, రైతులకు ఊతమిచ్చే విధంగా సబ్‌కే సాథ్- సబ్ కా వికాస్ విధానంలో మోదీ పనిచేస్తున్నారని అన్నారు.