తెలంగాణ

పండిట్ పోస్టుల్లో అర్హులైన ఎస్‌జీటీలకు అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: ఉన్నతీకరించిన పండిట్ పోస్టుల్లో ఫీడర్ కేటగిరి అయిన ఎస్‌జీటీలకు అవకాశం కల్పించాలని తెలంగాణ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సంకినేని మధుసూధన్‌రావు, ప్రధానకార్యదర్శి కరివేద మహిపాల్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సంఘం నేతలు సోమవారం నాడు పాఠశాల విద్య కమిషనర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం వారు కమిషనర్‌కు ఒక వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎన్‌సీటీఈ ప్రకారం జీవో 11,12లను అనుసరించి అన్ని పోస్టులకు కామన్ సీనియారిటీ ప్రకారం ఫీడర్ కేటగిరిలో ఉన్న వారితో భర్తీ చేయాలని అన్నారు. టీఆర్‌టీ నియామకాలకు రూపొందించిన అర్హతలను ప్రస్తుత పదోన్నతులకూ వర్తింపచేయాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 17,18లను హైకోర్టులో సవాలుచేశామని, వాటిని హైకోర్టు కొట్టివేసిందని వారు గుర్తుచేశారు. అప్‌గ్రేడేషన్ చేసిన పోస్టుల్లో అర్హతలున్న ఎస్‌జీటీలకు అవకాశం కల్పించాలని, ప్రాధమికపాఠశాల విద్యారంగానికి పునాది వంటిదని, ప్రతి పాఠశాలకు పీఎస్ హెచ్‌ఎంలను కేటాయించాలని, తద్వారా సీనియర్ ఉపాధ్యాయులకు పదోన్నతి లభిస్తుందని పేర్కొన్నారు. చాలా ప్రాధమిక పాఠశాలలు ఒకరు లేక ఇద్దరు ఉపాధ్యాయులతో నడుస్తున్నాయని, అలాగే ఉపాధ్యాయులకు అదనంగా హెచ్ ఎం బాధ్యతలు ఇవ్వడంతో ఐదు తరగతులు, 18 సబ్జెక్టుల్లో నాణ్యమైన , గుణాత్మక విద్యను ఎలా ఆశించగలుగుతామని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వారి బిడ్డలు చదువుతున్నారని, వారికి సౌకర్యాలు, ప్రమాణాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని అన్నారు. ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం ప్రాధమిక స్థాయిలో 10 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, తరగతికి ఒక ఉపాధ్యాయుడు, హెచ్‌ఎం కూడా ఉండాలని, అది ఎక్కడా అమలు కావడం లేదని అన్నారు.