తెలంగాణ

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దిశా నిర్దేశం చేసింది. జిల్లా కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు చాంతాడంతా ఉండవద్దని, కార్యవర్గం మొత్తంగా 21 మందికి మించవద్దని టీపీసీసీ ఆదేశించింది. కొత్తగా నియామకమైన జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులతో గాంధీభవన్‌లో సోమవారం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జీ ఆర్‌సి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ సమావేశమై పార్లమెంట్ ఎన్నికల వ్యూహం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 15 కల్లా డీసీసీల కార్యవర్గాలను ఏర్పాటు చేయడంతో పాటు కొత్త జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆర్‌సి కుంతియా ఆదేశించారు. జిల్లా కమిటీలు చాంతాడంతా ఉండకుండా కార్యవర్గం మొత్తంగా 21 మందికి మించవద్దని సూచించారు. బ్లాక్ కమిటీలు, మండల కమిటీలు, బూతు లెవల్ కమిటీలను కూడా డీసీసీ కార్యవర్గాలతో పాటు సమాంతరంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాల్లో ఉన్న రాష్ట్ర కమిటీ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు ప్రత్యేక డీసీసీ కార్యవర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారన్నారు. శాసనసభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని, అయితే ప్రజల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ తగ్గలేదన్నారు. జాతీయ రాజకీయాల దృష్ట్యా కేంద్రంలో తిరిగి కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకవెళ్లాలన్నారు. డీసీసీ కమిటీల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఉండే విధంగా కార్యవర్గాల కూర్పు ఉండాలన్నారు.
టీ.కాంగ్రెస్ సమన్వయ, ఎన్నికల
కమిటీల సమావేశాలు 15, 16కు వాయిదా
గాంధీభవన్‌లో సోమవారం జరగాల్సిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమన్వయ కమిటీ సమావేశం, అలాగే మంగళవారం మధ్యాహ్నం జరగాల్సిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశాన్ని వాయిదా వేసినట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ప్రధాన కార్యదర్శుల సమావేశం ఉండటంతో ఈ రెండు సమావేశాలను వాయిదా వేశామన్నారు. ఈ సమావేశాలను తిరిగి ఈ నెల 15, 16, 17న నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 15 నుంచి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు ప్రారంభవౌవుతాయన్నారు. అలాగే 16న సాయంత్రం 5 గంటలకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమన్వయ కమిటీ సమావేశం, 17న సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కమిటీ సమావేశాలను నిర్వహించనున్నట్టు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

చిత్రం.. కొత్తగా నియామకమైన జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులతో గాంధీభవన్‌లో సోమవారం సమావేశమైన
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్ తదితరులు