తెలంగాణ

కేసీఆర్ వౌనమేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఎందుకు మాట్లాడడం లేదని టీ.పీసీసీ కోశాధికారి గూడురు నారాయణ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలో ధర్నా చేయగలరా? అని ఆయన బుధవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నదని ధర్నా చేపట్టారని ఆయన తెలిపారు. వారి నిరసన ప్రదర్శనల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొని సంఘీభావం తెలిపారని గూడురు గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల మొత్తం ప్రతిపక్షాలన్నీ నిరసన గళం వినిపిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం బీజేపీకి చేరువ అయ్యేందుకు యత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలనూ కేంద్రం అమలు చేయకుండా తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని గూడురు నారాయణ రెడ్డి విమర్శించారు.