తెలంగాణ

అధినాయకత్వం విఫలమైంది: సుధాకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: సమసమాజం కోసం పని చేయాలని ఎంతో ఆశపడ్డామని అయితే మావోయిస్టు అగ్రనేతలే పార్టీని బలహీపర్చడం బాధపడ్డామని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట బుధవారం లొంగిపోయన సుధాకర్ మీడియాతో మాట్లాడారు. మావోయిస్టు పార్టీలో కూడా కుల వ్యవస్థ కొనసాగడం దురదృష్టకరమన్నారు. ఈ దుస్థితి కొనసాగినంత కాలం మావోయిస్టుపార్టీ ఎదుగుదల కష్టమేనని సుధాకర్ చెప్పారు. క్షేత్రస్థాయిలో కేడర్‌ను ముందుకు నడిపించడానికి అగ్రనేతలు ఎలాంటి చర్యలు తీసుకులేదని ఆరోపించారు. అగ్రనేతలు డబ్బుల కోసం వెంపర్లాడడం జరుగుతోందని తీవ్ర విమర్శ చేశారు. కొందరు వారి కుటుంబాల కోసం నిధులను మళ్లించిన సందర్భాలున్నాయని అన్నారు. అనారోగ్య కారణాలతోనే భార్యతోపాటు పోలీసులకు లొంగిపోయామన్నారు. ఇలా ఉండగా నాలుగు రోజుల క్రితమే సుధాకర్, నీలిమా జార్ఖండ్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.