తెలంగాణ

కాగ్ నివేదికతో రాఫెల్ వాస్తవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని కాగ్ నివేదికతో తేలిపోయిందని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధరరావు పేర్కొన్నారు. బుధవారం నాడు ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రాజకీయ అవసరాల కోసమే రాఫెల్ వ్యవహారంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినట్టు కాగ్ నివేదికతో ప్రజలకు అర్ధమైందని అన్నారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు సరైనదేనని కాగ్ నివేదికతో మరోమారు స్పష్టమైందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన దళారీ వ్యవస్థను అంతం చేసి మోదీ సర్కార్ సరికొత్త నిర్ణయాలను తీసుకుంటోందని చెప్పారు. ఇది రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం అని చెప్పారు. రాఫెల్ వ్యవహారంపై విపక్షాల దుష్ప్రచారాన్ని, కాంగ్రెస్ పార్టీ దివాలాకోరుతనాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే, అభ్యర్ధుల ఎంపికతో పాటు పార్టీ ఎన్నికల ప్రచారలాన్ని ముమ్మరం చేస్తామని అన్నారు. దేశానికి నిత్యం అబద్దాలు చెబుతున్న వారిని ప్రజాస్వామ్యం ఏ విధంగా శిక్షిస్తుందని ప్రశ్నించారు. అంతకు ముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ కాగ్ నివేదిక గురించి మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ఇన్ని రోజులూ చేసిన విమర్శలు పూర్తిగా అబద్దాలేనని తేలిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి దేశ రక్షణ కంటే రక్షణ పేరుమీద డబ్బులు లూటీ చేయడంలోనే ఆసక్తి ఉందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో దళారులు లేకుండా రక్షణ సామగ్రీని సైతం కొనుగోలు చేయలేదని, పచ్చ కామెర్ల వారికి దేశం అంతా పచ్చగానే కనిపిస్తుందని అనడానికి రాహల్ గాంధీ విమర్శలే నిదర్శనమని అన్నారు. ఆకాశంపై ఉమ్మివేస్తే అది మనపైనే పడుతుందని కాంగ్రెస్ ఇప్పటికైనా తెలుసుకోవాలని అన్నారు. కాగ్ నివేదిక బీజేపీ వాదనను, మోదీ నిజాయితీని తేటతెల్లం చేశాయని చెప్పారు. ఇది రాహుల్, కాంగ్రెస్‌కు చెంపపెట్టులాంటిదని , తెలంగాణలో ప్రజలు మోదీని ఆదరించి లోక్‌సభ సభ్యులను గెలిపించాలని అన్నారు.
చిత్రం.. ప్రతి ఇంటిమీద బీజేపీ జెండా లోగో ఆవిష్కరణ చేస్తున్న
బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధరరావు