తెలంగాణ

లోక్‌సభ ఎన్నికలపై కలెక్టర్లకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: త్వరలో జరగనున్న లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు ప్రారంభించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్లకు, ఇతర ఎన్నికల అధికారులకు బుధవారం, గురువారం రెండు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. బేగంపేట హరిత ప్లాజాలో మొదటి రోజు శిక్షణను రజత్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీ అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష చేశారు. లోక్‌సభ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు ఈసీ శిక్షణ ఇస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా రజత్‌కుమార్, కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం రజత్‌కుమార్ కేంద్ర ఎన్నికల ప్రధానకాధికారి సునీల్ అరోరాతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై ప్రధానకార్యదర్శి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రజత్ కుమార్ మాట్లాడుతూ అవగాహన లేక వికారాబాద్ కలెక్టర్ ఈవీఎంలను తెరిచారని, అది నిబంధనలకు విరుద్ధమేనని అన్నారు. ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుందని అన్నారు. సాధారణ బదిలీలతో తమకు సంబంధం లేదని, మూడేళ్లు పూర్తయి ఎన్నికల విధులు నిర్వహించే వారిని బదిలీ చేయాలని సూచించామని అన్నారు. ఓటరు జాబితాలో సవరణకు 27.31 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, ఏడు లక్షలకు పైగామొదటిసారి ఓటు హక్కు పొందారని అన్నారు. మరో నాలుగైదు లక్షల వరకూ ఓటు హక్కు పొందే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లుపై సీఈసీ సునీల్ అరోరా ప్రధాన కార్యదర్శితో సమీక్షించారు. ఏర్పాట్లుపై సునీల్ అరోరా సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుత శిక్షణలో ఉత్తీర్ణులు కాని వారికి , శిక్షణకు రాని వారికి ఈ నెల 20,21 తేదీల్లో ఢిల్లీలో శిక్షణ ఉంటుందని సునీల్ అరోరా చెప్పారు. ఖాళీగా ఉన్న డీఈవో, ఆర్వో పోస్టులను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వానికి సూచించామని అన్నారు. కొన్ని చోట్ల రిటర్నింగ్ అధికారులను మార్చాలని విజ్ఞప్తులు వచ్చాయని, వాటిని పరిశీలిస్తున్నామని అన్నారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎక్కడా రీ పోలింగ్ జరగలేదని, శాసనసభ ఎన్నికల్లో 35 వేల మంది ప్రిసైడింగ్ అధికారులు పాల్గొన్నారని అన్నారు. ఈవీఎంల వినియోగంలో 150 నుండి 200 మంది అధికారులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమేనని రజత్‌కుమార్ వెల్లడించారు. ఈవీఎంల వినియోగం, ఇతర ఎన్నికల అంశాలకు సంబంధించి పాత్రికేయులకు సైతం శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు. ఈవీఎంలపై అనుమానాలుంటే రాజకీయ పార్టీలు వీవీ ప్యాట్స్ లెక్కించుకోవచ్చని, ఇందులో ఎలాంటి గోప్యత లేదని అన్నారు.
చిత్రం.. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరాను కలుసుకున్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్