తెలంగాణ

25లోగా ఇంటింటికీ నల్లా నీళ్లు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఫిబ్రవరి 15: మిషన్ భగీరథ ద్వారా ఈ నెల 25 లోగా జిల్లాలోని పల్లెల్లో ప్రతీ ఇంటికి నల్లా నీరు అందించాలని, రానున్న మార్చిలోగా ప్రతీ గ్రామంలో త్రాగునీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. శుక్రవారం ఎల్‌ఎండిలోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటులో ఇంజనీర్లతో మిషన్ భగీరథ పనుల ప్రగతిపై సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న పది రోజుల్లో జిల్లాలోని 494 హాబిటేషన్లలోని 1,74,657 ఇండ్లకు నల్లా కనెక్షన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 494 హాబిటేషన్లకు గాను 397 హాబిటేషన్లకు బల్క్ వాటర్ సప్లై చేస్తున్నారని, మిగిలిన 97 టికి కూడా వాటర్ సరఫరా చేయడం లేదని ఇంజనీర్లపై ఆమె మండిపడ్డారు. మిషన్ భగీరథ పనులు కరీంనగర్ జిల్లాలో నెమ్మదిగా కొనసాగుతున్నాయని, రాష్ట్రంలో మొత్తం మిషన్ భగీరథ పనులు పూర్తయినా కరీంనగర్ జిల్లాలో ఇంకా పూర్తి కాకపోవడానికి గల కారణాలు ఏమిటని? ఆమె ప్రశ్నించారు. ఇంజనీర్లు సక్రమంగా పనిచేస్తున్నారా? ఏజెన్సీలో సమస్యలేమైనా ఉన్నాయా? లేకపోతే ఆలస్యానికి గల కారణాలు ఏమిటి? అని అధికారులను ఆమె నిలదీశారు. మిషన్ భగీరథ పనులను ప్రణాళికాబద్ధంగా సకాలంలో పూర్తి చేయాలని, ప్రజలకు క్లోరినేషన్ చేసిన స్వచ్ఛమైన మంచినీరు అందించాలని ఆదేశించారు. గ్రామాలలో మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్న నీరు ప్రజలు వినియోగించుకుంటున్నారా? ప్రజలకు మిషన్ భగీరథ నీరు సక్రమంగా అందుతుందా? స్వచ్ఛమైన నీటిని త్రాగుతున్నారా? అని క్షేత్ర స్థాయిలో అడిగి తెలుసుకున్నారా? వీటన్నింటిపై అధ్యయనం చేస్తున్నారా? అని ఆమె ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక ఒకరిమొఖం మరొకరు చూసుకున్నారు. జిల్లాలో ఒహెచ్‌ఆర్ నిర్మాణాలు ప్రగతి బాగుందన్నారు. నిర్మాణాలు పూర్తయిన వాటిని పూర్తి స్థాయిలో ఒకటికి రెండుసార్లు పరిశీలించి నీటితో నింపి నీటిని తొలగించిన తరువాతనే ప్రజలకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. రానున్న మార్చి మాసంలో ప్రతీ గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి త్రాగునీరు సరఫరా కావాలన్నారు. మార్చిలో ఆకస్మిక తనిఖీలో నిర్వహించిన పథకం అమలుతీరు, త్రాగునీటి నాణ్యత ప్రమాణాలను క్షేత్ర స్థాయిలో తెలుసుకుంటామని ఆమె తెలిపారు. మిషన్ భగీరథ పనులపై నిర్లక్ష్యం వహించరాదని, సిఎం కేసిఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే సంకల్పానికి తోడ్పాటు అందించని అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఎల్‌ఎండిలోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటును, ప్రహరీగోడ నిర్మాణ పనులు పది, ఇరవై రోజుల్లో పూర్తి చేసి ఎల్‌ఎండిలో లైట్స్ ఏర్పాటు చేయాలన్నారు. సైన్ బోర్డు, గేట్స్, అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. నీటి శుద్ధి కేంద్రంలో గ్రౌండింగ్‌ను లెవలింగ్ చేయాలని, వర్షాకాలంలో నీరు నిలువకుండా మట్టి పోయించాలన్నారు. 12 స్టాప్ క్వార్టర్స్ నిర్మిస్తున్నారని, అదనంగా ఒక బ్లాక్ క్వార్టర్స్ నిర్మించేందుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. గెస్ట్ రూమును కూడా నిర్మించాలని, నీటి శుద్ధి కేంద్రంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను ఇంచార్జిగా నియమించాలని, దీని నిర్వహణ ఇఇ తీసుకోవాలని, నీటిశుద్ధి కేంద్రంలో ఇఇకి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని, పై వాటిని తూ.చ.తప్పకుండా అమలుపర్చాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ కృపాకర్‌రెడ్డి, జెసి శ్యామ్‌ప్రసాద్ లాల్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రావీణ్య, సిఇ శ్రీనివాస్, ఎస్‌ఇ అమరేందర్ రెడ్డి, ఇఇలు, ఎఇలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.