తెలంగాణ

ఆర్టీసీ బస్సు బోల్తా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, ఫిబ్రవరి 15: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎపిఎస్ ఆర్టీసి బస్సు బోల్తాపడి పలువురు గాయపడ్డ సంఘటన నల్లగొండజిల్లా వేములపల్లి గ్రామపరిధిలోని బుగ్గబావిగూడెం గ్రామసమీపంలో అద్దంకి - నార్కేట్‌పల్లి రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సంఘటన వివరాలు పోలీసులు, బావితుల కథనం ప్రకారం ప్రకాశం జిల్లా కందుకూరు డిపోకు చెందిన ఎపి 27 జెడ్ 0273 సుపర్ లక్సరి బస్సు కందుకూరు నుంచి హైద్రాబాద్‌కు బయలుదేరింది. బస్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటు 37మంది ప్రయాణీకులు ఉన్నారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున సుమారు మూడున్నర గంటల సమయంలో వేములపల్లి మండల పరిధిలో బుగ్గబావిగూడెం గ్రామసమీపంలో గంగమ్మ గుడి దగ్గరికి రాగానే డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పంటపొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. బస్సు బోల్తాపడిన విషయం తెలుసుకున్న వేములపల్లి పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకోని గాయపడిన 22మంది ప్రయాణీకులను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అందులో ముగ్గురు ప్రయాణీకులైన కుటుంబరావు, కృపాకర్‌రావు, లలితదేవిలు తీవ్రంగా గాయపడినట్లు వారిని చికిత్సనిమిత్తం కృపాకర్‌రావుని ఒంగోలు ఆసుపత్రికి తరలించగా లలితదేవి, కుటుంబరావులను హైద్రాబాద్ ఆసుపత్రికి తరలించారు. బస్సు బోల్తాపడిన సంఘటన తెలుసుకున్న డిఎస్పి పద్మానాధుల శ్రీనివాస్, రూరల్ సిఐ రమేష్‌బాబు, తహసీల్దార్ రాజేశ్వరి, ఎస్‌ఐ సుధీర్‌బాబులు సంఘటన స్ధలానికి చేరుకోని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ సుధీర్‌బాబు తెలిపారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలందించాలి: ఎమ్మెల్యే భాస్కర్‌రావు
వేములపల్లి మండలపరిధిలోని బుగ్గబావిగూడెం గ్రామసమీపంలో అద్దంకి -నార్కేట్‌పల్లి రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఎపిఎస్ ఆర్టీసి బస్సు బోల్తాపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు హుటహుటిన సంఘటన స్ధలానికి చేరుకోని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బస్సు బోల్తాపడిన సంఘటలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యమందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ఆయన వెంట బొర్ర శ్రీనులు ఉన్నారు.