తెలంగాణ

కొత్తగా నారాయణపేట, ములుగు జిల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 31 జిల్లాలకు తోడుగా ఆదివారం నుండి నారాయణపేట, ములుగు జిల్లాలు చేరుతున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 33 కు చేరుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో ఈ రాష్ట్రంలో కేవలం 10 జిల్లాలు మాత్రమే ఉండేవి. పరిపాలనాసౌలభ్యం కోసం తొలిదశలో వీటిని 31 జిల్లాలుగా విభజించారు. ఒక్క హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాలు కూడా విభజనకు గురయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం జీఓలు జారీ చేసింది. ఆదివారం నుండి నారాయణపేట, ములుగు జిల్లాల్లో పరిపాలన ప్రారంభమవుతోంది.
నారాయణపేట జిల్లా కలెక్టర్ బాధ్యతలను (్ఫల్ అడిషనల్ చార్జ్) మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న డి. రోనాల్డ్ రోజ్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం శనివారమే ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ములుగు జిల్లా కలెక్టర్ బాధ్యతలను (్ఫల్ అడిషనల్ చార్జ్) జయశంకర్-్భపాలపల్లి కలెక్టర్‌గా పనిచేస్తున్న వి. వెంకటేశ్వర్లుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇప్పటి వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో రెవెన్యూ డివిజన్‌గా ఉన్న నారాయణపేటను కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారు. అలాగే జయశంకర్-్భపాలపల్లి జిల్లాలో రెవెన్యూ డివిజన్‌గా ఉన్న ములుగును జిల్లాగా ఏర్పాటు చేశారు. నారాయణపేట జిల్లాలో 11 మండలాలు, 252 గ్రామాలు ఉన్నాయి. ములుగు జిల్లాలో తొమ్మిది మండలాలు 336 గ్రామాలు ఉన్నాయి.