తెలంగాణ

ఆర్మీ అధికారుల నిర్వహణ సామర్థ్యం పెంచుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ఆర్మీ మేనేజిమెంట్ స్టడీస్ బోర్డు 19 వ వార్షిక సమావేశం ఇక్కడ ప్రధాన కార్యాలయం ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ మిలిటరీ కాలేజీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో జరిగింది. ఈ సమావేశానికి లెఫ్టినెంట్ జనరల్ పీసీ తిమ్మయ్య అధ్యక్షత వహించారు. ఆయన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా ఉన్నారు. భారతీయ సైన్యం, అకాడమీల మధ్య సమన్వయం పెంపొందించేందుకు అన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని లెఫ్టినెంట్ జనరల్ పీసీ తిమ్మయ్య చెప్పారు. పరస్పర సహకారంతో, ఉమ్మడి పరిశోధన కార్యక్రమాలపై ప్రణాళికలను ఖరారు చేసినట్లు చెప్పారు. ఆర్మీ అధికారులకు అవగాహన పెంపొందించేందుకు వ్యూహాత్మక అంశాలపై సదస్సులను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాల వల్ల భారత ఆర్మీ అధికారుల నిర్వహణ సామర్థ్యం పెరుగుతుందన్నారు.
చిత్రం.. ఆర్మీ మేనేజిమెంట్ బోర్డ్ వార్షిక సమావేశంలో పాల్గొన్న లెఫ్టినెంట్ జనరల్ పీసీ తిమ్మయ్య తదితరులు