రాష్ట్రీయం

లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ రాష్టశ్రాఖ సిద్ధంగా ఉందని, పార్టీ పరంగా చేయాల్సిన ఏర్పాట్లు, ప్రచారం , ఇతర సన్నాహాలు ప్రారంభించామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ చెప్పారు. శనివారం నాడు ఆయన పాత్రికేయులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ రానున్న లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నెలాఖరులో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి వస్తారని, అలాగే వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి వస్తారని చెప్పారు. సికింద్రాబాద్ లోక్‌సభ క్లస్టర్ సమావేశంలో ప్రధాని పాల్గొంటారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ సంస్థాగత పటిష్టత కార్యక్రమాలతో పాటు ఎన్నికల కమిషన్ చేపట్టాల్సిన చర్యలను, రాష్ట్ర ప్రభుత్వ తీరును, కేంద్ర పథకాలను వివరించారు. పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలతో సన్నాహాలు ప్రారంభం అయ్యాయని చెప్పారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లపైనా ఫోకస్ ఉంటుందని అన్నారు. టీఆర్‌ఎస్ ఎక్కువ సీట్లలో గెలిచినా వారికి దక్కేది ఏమీ ఉండదని, టీడీపీతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారీ నష్టపోయింది తామేనని అన్నారు. 55 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలోనూ, 55 నెలల నరేంద్రమోదీ పాలనలోనూ ఉన్న వ్యత్యాసాన్ని దేశ ప్రజలు అర్ధం చేసుకున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణం కర్ణుడి చావుకి ఎన్నికారణాలు ఉన్నాయో అనే్న ఉన్నాయని అన్నారు. స్థానిక ప్రభుత్వం చెప్పినట్టే ఎన్నికల కమిషన్ అధికారులు పనిచేశారని పేర్కొన్నారు. ఎన్నికల ఓటింగ్ సమయాన్ని మరో గంట పెంచాల్సి ఉందని, అలాగే సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచాలని, ఈవీఎంలకు సాంకేతిక లోపాలు లేకుండా చూడాలని, ఒక కుటుంబంలోని సభ్యుల ఓట్లు అన్నీ ఒకే పోలింగ్ బూత్‌లో ఉండాలని సూచించనున్నట్టు చెప్పారు. అలాగే వరుసగా సెలవులు ఉన్న సమయంలో పోలింగ్ పెడితే సెలవుపైనే అందరి దృష్టి ఉంటుందని, పోలింగ్‌పై ఉండదని, కనుక వీలైనంత వరకూ సెలవులు లేని సమయంలో పోలింగ్ పెట్టాలని సూచించారు. పార్లమెంటుకు పోటీ చేయాలనే ఆలోచన అందరికీ ఉంటుందని , అయితే ఎవరు పోటీ చేయాలనేది పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందని, నాయకత్వ ఆదేశాలను అనుసరించి అంతా కలిసికట్టుగా వారి విజయానికి పనిచేస్తామని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే విధానం లేదని, బలమైన అభ్యర్ధుల జాబితాలను కమిటీలే రూపొందిస్తాయని అన్నారు. నరేంద్రమోదీ ప్రధాని కావాలని అంతా కోరుకుంటున్నారని, చివరికి విపక్ష నేతలు సైతం శాసనసభల్లో మోదీ పాలనను కొనియాడారని చెప్పారు. మార్చి 2 తర్వాత నియోజకవర్గాల వారీ మూడు మూడు పేర్లను పార్టీ అధిష్టానానికి పంపిస్తామని, అందులో ఒకరి పేరును పార్టీ నాయకత్వం ఎంపిక చేస్తుందని అన్నారు. మార్చి 2వ తేదీన ప్రతి అసెంబ్లీ కేంద్రంగా 1000 మందితో 50 కిలోమీటర్లు బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని, 25న నల్గొండ క్లస్టర్, 26న వరంగల్ క్లస్టర్ మీటింగ్‌లు ఉంటాయని అన్నారు. 26వ తేదీన కమలజ్యోతి పథకం కింద కార్యకర్తలు లబ్దిదారుల ఇళ్లవద్దకు వెళ్లి జ్యోతి వెలిగించి సంబరాలు చేస్తారని అన్నారు. 26న మండలస్థాయి కార్యకర్తలతో పీఎం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిస్తారని , కరీంనగర్ ఎంఎల్‌సీ సీటు విషయంలో బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్‌కూ మధ్య ఎలాంటి వివాదం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు నిలదీసే రోజు వస్తుందని అన్నారు.