తెలంగాణ

ఇష్టపడి చదివితే ఉజ్వల భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట : భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందని..ఐదేళ్లు కష్టపడితే యాబై ఏళ్ల ఉజ్వల భవిష్యత్ మీదేనని.. రాష్ట్రానికి.. దేశానికి సేవ చేసిన వారవుతారని విద్యార్థులకు మార్గదర్శిగా మాజీ మంత్రి హరీష్‌రావు దిశా, నిర్దేశం చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని దూది మల్లారెడ్డి గార్డెన్‌లో తెలంగాణ సమీకృత సివిల్ సర్వీసెస్ అసోసియేషన్ (టిక్సా) ఆధ్వర్యంలో కెరిర్ గైడెన్స్ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరైనారు. టెక్సా ఆధ్వర్యంలో సత్య ప్రమోద విద్యొన్నతి - లింబాద్రి ఎడ్యుకేషనల్ ట్రస్టుచే ఉచితంగా సివిల్ సర్వీసెస్ కోచింగ్ లోగోను ఆవిష్కరించారు. ఆనంతరం పూల్వామాలో సైనికుల జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించి, వౌనం పాటించి నివాళ్లు అర్పించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ పరిపాలకుడిగా మనం మారాలని, ఆ దిశగా ఈ తరం యువతలో మార్పు రావాలని, ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగాలన్నారు. ఇంజనీరింగ్ చదివి పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం కావాలని తనవద్దకు ఏన్నో దరఖాస్తులు తీసుకొచ్చారన్నారు. టిక్సా ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించటం అభినందనీయన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ఢిల్లీకి వెళ్లితే ఉత్తర దేశాల వారైన బీహార్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారు అధికంగా ఉంటారన్నారు. అమెరికా వెళ్లాలని, డాక్టర్, ఇంజనీర్ కావాలని ఆశలు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉందన్నారు. ఇంజనీరింగ్ చదివి ఆటోడ్రైవర్, ఉపాధిహామీలో ఫీల్డు అసిస్టేంట్‌గా చేస్తున్నారన్నారు. సివిల్ సర్వీసులోకి వెళ్లితే దేశానికి సేవ చేయవచ్చని, విదేశి రాయబార కార్యాలయాల్లో చేసేలా ఉన్నతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ అవకాశాలు రావాలంటే సివీల్ సర్వీస్ పరీక్షలు వ్రాస్తే వస్తాయని పేర్కొన్నారు. సివిల్ పరీక్షలు రాస్తే ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలే కాదని, ప్రైవేటు రంగాల్లో కూడ ఉద్యోగాలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీసెస్‌లోకి రావటం లేదని, కేంద్రంలో తెలంగాణ అధికారులు చాల తక్కువగా ఉన్నారన్నారు. కేంద్ర ప్రభు త్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు ఇతర రాష్ట్రాల ఐఎఎస్‌లు ఉంటారని, దక్షిణ భారతదేశంలో అధికంగా ఇంజనీరింగ్ విద్యను చదువుతున్నారన్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలు వ్రాస్తే విదేశీరాయబారులుగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో మనదేశం తరుపున పనిచేసే అవకాశం వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం యువత ఆలోచన చేయాలని, ఈఅంశంపై చర్చా జరుగాలంటే సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు వెళ్లాల్సిన అవశ్యకతను తెలిపి విద్యార్థులకు ప్రరేపించారు. ఈటిక్సా అకాడమి పక్షాన 25 మంది యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వటంతో పాటు సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు కల్పించేలా టిక్సా కృషిచేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.

చిత్రం.. సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే హరీష్‌రావు