తెలంగాణ

భక్తిశ్రద్ధలతో సేవాలాల్ జయంత్యుత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుభీర్, ఫిబ్రవరి 17: తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, కుభీర్ మండల కేంద్రంలో ఆదివారం సద్గురు సేవాలాల్ మహారాజ్ 280వ జయంతిని భక్తి శ్రద్ధలతో గిరిజనులు జరుపుకున్నారు. సేవాలాల్ ఆలయం నుండి మండల కేంద్రంలోని ప్రధాన వీధులగుండా మహిళలు, పురుషులు పిల్లలు భక్తి పాటలతో ఆడి పాడారు. సాంప్రదాయ దస్తువులను ధరిస్తూ వేషభాషలతో ప్రధాన వీధులగుండా శోభాయాత్ర నిర్వహించి స్థానికులను ఆకట్టుకున్నారు. ఆచార వ్యవహారాలను, భాషా, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి ఇటీవల గ్రామ గ్రామాల్లో ఏర్పడిన గోర్‌సేన గోరిశిఖవాడ గురించి అవగాహణ కల్పించడానికి మహారాష్ట్ర నుంచి విచ్చేసిన కాశీనాథ్ మాట్లాడారు. సమాజంలో గిరిజనుల భాష, సాంప్రదాయం, కుల వృత్తులు, వ్యవసాయం, పశుపోషణ లాంటి విషయాలను మరువకుండా చూడాలన్నారు. పాశ్చాత్య మోజులో పడి మాతృభాషను మర్చిపోతున్నారన్నారు. సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో ప్రతీ ఒక్కరు నడుచుకోవాలన్నారు. తోటివారిని ప్రేమించి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలన్నారు. ఈ జయంతి ఉత్సవాలకు మండల కేంద్రంతోపాటు చుట్టుపక్కల మండలాల నుంచి అధికసంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.