తెలంగాణ

హరీష్ భవితవ్యంపై అనిశ్చితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తరించే కేబినెట్‌లో మాజీ మంత్రి హరీష్‌రావు చోటు దక్కుతుందా? లేదా? అన్న అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 19న విస్తరించే మంత్రివర్గంలో 8 నుంచి 10 మంది వరకు మంత్రి వర్గంలో స్థానం కల్పించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కేబినెట్‌లో చోటు దక్కే ఎమ్మెల్యేలకు సమాచారం అందించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, మాజీ మంత్రి హరీష్‌రావును కేబినెట్‌లో స్థానంపై అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పలు చౌరస్తాల్లో ఏ నలుగురు కలిసిన హరీష్‌రావుకు మంత్రి పదవి దక్కుతుందా...లేదా అని చర్చించుకుంటున్నారు. గత కేబినెట్‌లో అన్ని పదవులు సమర్థవంతంగా నిర్వహించి పదవులకు వనె్న తెచ్చిన మాజీ మంత్రి హరీష్‌రావు ఈ మారు పదవిపై చోటులేదని ప్రచారం జరగటం సిద్దిపేటలో గులాబీ తమ్ములతో పాటు, సామాన్య ప్రజలను కలవరానికి గురిచేస్తుంది. గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధికంగా 1,18,699 లక్ష ఓట్ల రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్రంలోని 30 నియోజక వర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి పార్టీ అభ్యర్థుల విజయంలో కీలకపాత్ర నిర్వహించారు. గజ్వేల్‌లో సైతం సీఎం కేసీఆర్‌ను భారీ మెజార్టీలో విజయం సాధించటంలో హరీష్‌రావు ముఖ్యభూమికను నిర్వహించారు. కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరిగిన ఖచ్చితంగా మాజీ మంత్రి హరీష్‌రావుకు చోటు లభిస్తుందని ప్రచారం జరిగింది, కాని ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం కేబినేట్‌లో చోటు అనుమాననే అని ప్రచారం జరుగుండటంతో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించగానే సీఎం కేసీఆర్ తన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా పదవిని కట్టబెట్టి ప్రమోషన్ కల్పించారు. కాని తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుండి కేసీఆర్‌కు వెన్నంటి ఉన్న హరీష్‌రావును దూరం పెడుతుండటాన్ని సిద్దిపేట టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన భవి ష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.