తెలంగాణ

మహిళలంటే సీఎంకు చిన్నచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: మంత్రివర్గంలో కీలక శాఖలు అన్నీ తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలే లేకుండా చేస్తున్నారని, ముఖ్యమంత్రికి మహిళలంటే చిన్నచూపులా అనిపిస్తోందని బీజేపీ నేత జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మహిళలను చిన్న చూపు చూస్తున్న సీఎంపై షీ టీమ్‌లు కేసు నమోదు చేయాలని ఆయన ఎద్దేవా చేశారు. మహిళలు, గిరిజనులు గత మంత్రివర్గంలోనూ లేరని , సీఎం మహిళలపై వివక్ష చూపుతున్నారని అన్నారు. పుల్వామా ఘటనపై మాట్లాడుతూ పాకిస్తాన్ టెర్రిరిస్టులకు పరిశ్రమగా మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వం పాకిస్తాన్‌కు సరైన గుణపాఠం నేర్పిందని అన్నారు. భారత్ ఎవరిపైనా దాడులు చేయలేదని, పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా భారత్ మాత్రమే కాదని, ప్రపంచం యావత్తు గుర్తిస్తోందని అక్కడి ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ గుర్తించాలని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ప్రధాని అయినా, గతంలో జరిగిందంతా ఆయనకు తెలియనిదేమీ కాదని పేర్కొన్నారు. ఉగ్రవాదులను సన్మానిస్తున్న ఇమ్రాన్‌ఖాన్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని , ముక్తకంఠంతో ప్రజలు అంతా ఈ ఘటనను ఖండిస్తున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. మమతాబెనర్జీ, చంద్రబాబు లాంటి నేతలు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని, నరేంద్రమోదీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. దేశ ప్రయోజనాలకు భంగం కలిగించేలా చంద్రబాబు, మమతా బెనర్జీ మాట్లాడుతున్నారని అన్నారు.