తెలంగాణ

బీజేపీని ఓడించడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా సీపీఎం పని చేస్తుందని ఆ ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. బుధవారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలసి ఏచూరి మీడియాతో మాట్లాడారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మూడు ప్రధాన అంశాలపై తాము ప్రచారం చేస్తామని వెల్లడించారు. కేంద్రంలో బీజేపీని గద్దెదింపడమే ప్రధాన అజెండాగా ఆయన చెప్పారు. వామపక్ష భావజాలం ఉన్న శక్తులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సెక్యులర్ శక్తులతో ఐక్యకూటమి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క హామీ అమలుచేయలేదని, పైగా విపక్షాలను దెబ్బతీయడానికి ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. ఇవన్నీ ప్రజలకు వివరిస్తామని ఏచూరి చెప్పారు. బీజేపీ తన మనుగడను నిలబెట్టుకోవడానికి మతాన్ని వాడుకుంటోందని ఆయన విమర్శించారు. రాజ్యాంగ సంస్థలను బీజేపీ ఎలా దుర్వినియోగం చేస్తున్నదీ ప్రజలకు వివరిస్తామని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ‘సేవ్ బెంగాల్’ నినాదంతో విస్తృత ప్రచారం చేస్తామన్నారు. దేశ వ్యాప్తంగా సీపీఎంతో జతకట్టడానికి ప్రాంతీయ పార్టీలు ముందుకు వస్తున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన ఫెడరల్ ఫ్రంట్‌కు సీపీఎం మద్దత్తు ఇస్తుందా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. ఏదైనా ఎన్నికల ఫలితాల తర్వాతే కూటములు గురించి చర్చిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకెళ్తామని సీపీఎం నేత స్పష్టం చేశారు. ఈవీఎంల పనితీరుపై ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేశామన్నారు. ఈవీఎంతో పాటు వీవీ ప్యాడ్‌లను లెక్కించాలని ఈసీకి సూచించినట్టు ఆయన వెల్లడించారు. పుల్వామాలో సైనికులపై ఉగ్రదాడిలో నిఘా వర్గాలు విఫలం చెందాయని ఆ రాష్ట్ర గవర్నర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.ప్రధమ పౌరుడై ఉండి దుశ్చర్యలను ఖండించకుండా నిఘా వర్గాలపై నెట్టడం ఏమిటని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ తమతో కలిసి పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేయడం పట్ల తమ్మినేని వీరభద్రం స్వాగతించారు. కాంగ్రెస్ తో పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐ కలసి పని చేయడానికి చర్చలు జరుగుతున్నాయన్న ప్రశ్నికు ‘ సీపీఐ తన వైఖరిని ప్రకటించినందున అపోహాలకు అవకాశం లేదు’అని బదులిచ్చారు. 10 టీవీ యాజమాన్యం అక్రమాలకు పాల్పడుతోందని వస్తున్న విమర్శలపై తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ‘ చానల్‌లో పెట్టుబడులు పెట్టిన మదుపర్లకు తెలియకుండా ఎలా అక్రమాలు జరుగుతాయి’అని ఎదురుప్రశ్నించారు. ఒక మీడియాపై మరొక మీడియా అభాండాలు వేయడం సమంజసం కాదన్నారు. 10 టీవీని విక్రయిస్తున్నట్టు వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని తెలిపారు. మదుపర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న తమ్మినేని 10 టీవీ నష్టాల్లో ఉన్నమాట వాస్తవమేనని అంగీకరించారు.