తెలంగాణ

ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ శాసనమండలికి ఐదుగురు ఎమ్మెల్సీలను ఎన్నుకునేందుకు గురువారం నోటిఫికేషన్ జారీ అయింది. ఎన్నికల కమిషన్ ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా పనిచేస్తున్న పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మహ్మద్ అలీ షబ్బీర్, టి. సంతోష్‌కుమార్, మహమ్మద్ సలీం, మహమూద్ అలీల పదవీ కాలం 2019 మార్చి 29 వరకు ముగుస్తుంది. ఈలోగా ఎన్నికలు జరిగితే కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. అయితే ఎవరు కూడా నామినేషన్లు వేయలేదు. మార్చి 1 వరకు నామినేషన్లు స్వీరించేందుకు అవకాశం ఉంది. మార్చి 5 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా ఉంది. మార్చి 12 న ఎన్నికలు నిర్వహిస్తారు. శాసనసభలో ఉన్న బలాబలాల ప్రకారం టీఆర్‌ఎస్‌కు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు, కాంగ్రెస్‌కు ఒక ఎమ్మెల్సీ స్థానం లభించే అవకాశం ఉంది.