తెలంగాణ

ఓట్ ఆన్ అకౌంట్ నిరాశ పరిచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: ఓట్ ఆన్ అకౌంట్ నిరాశ కలిగించిందని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని ఆయన విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీ వాయిదాపడిన అనంతరం సీఎల్‌పి సమావేశం జరిగింది. సమావేశానంతరం భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ ఓట్ ఆన్ అకౌంట్‌పై శనివారం జరిగే చర్చలు తమ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీ్ధర్ బాబు, సబితా ఇంద్రారెడ్డి ప్రసంగిస్తారని చెప్పారు. ఓట్ ఆన్ అకౌంట్‌లో నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదని అన్నారు. ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పకుండా నిరుద్యోగులను నిరాశ పరిచారని ఆయన తెలిపారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. పూర్తి స్థాయి బడ్జెట్ ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. పూర్తి స్థాయి బడ్జెట్ పెడితే బాగుండేదని అన్నారు. బడ్జెట్ అంకెలు నిరాశజనకంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. ఎప్పటి నుంచి రైతు బంధు, ఆసరా పెన్షన్లు పెంచి అమలు చేస్తారో పేర్కొనలేదని భట్టి అన్నారు. అసెంబ్లీ సమావేశాలను 10 రోజుల పాటు నిర్వహించాలని భట్టి డిమాండ్ చేశారు.
డబుల్ బెడ్ పథకానికి కేటాయింపులు ఏవీ..?: చాడ ప్రశ్న
రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్‌ల నిర్మాణాలకు నిధుల కేటాయింపులు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. శుక్రవారం ముఖ్దూం భవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికల సమయంలో హామీలు గుప్పించారని గుర్తుచేశారు. అయితే అమలు చేయడానికి నిధులు విడుదలకు జాప్యం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల వయోఃపరిమితి అంశాలను ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రస్తావించకపోవడం దురదృష్టకరమన్నారు. రెవెన్యూ లోటును రూ. 6.564 కోట్లుగా చూపిండం చూస్తే బడ్జెట్‌లో కాకిలెక్కలు తప్ప మరొకటి కాదన్నారు. బీసీల సబ్‌ప్లాన్ ప్రస్తావనే లేదన్నారు. వివిధ పద్దుల కింద నిధులు చూపించినా ఆచరణలో ఖర్చు చేయలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సరైన కేటాయింపులు లేకపోవడం ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతాయన్న నమ్మకం లేదన్నారు. రాష్ట్రానికి ఎన్ని కోట్ల అప్పులు ఉన్నాయో లెక్కలు చెప్పలేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అప్పు ఎంత తెచ్చారో ప్రకటించకపోవడం పట్ల వాస్తవాలను కప్పిపుచ్చడమేనన్నారు. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో విద్యా రంగానికి సరైన నిధులు కేటాయించకుండా మొండిచెయ్యి చూపించారని తెలంగాణ ఏఐఎస్‌ఎఫ్ అధ్యక్షుడు అశోక్‌స్టాలిన్, ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ విమర్శించారు. ఫీజు రియింబర్స్‌మెంట్, స్కాలర్స్‌షిప్‌ల గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదన్నారు.
అంసంఘటిత రంగం ఊసేలేదు
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అసంఘటిత రంగం ఊసేలేదని రాష్ట్ర సీఐటీయు అధ్యక్షుడు చుక్కారామలు ధ్వజమెత్తారు. శుక్రవారం ఓ ప్రకటన చేస్తూ ఓటు ఆన్ ఎకౌంట్ బడ్జెట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం గారడీ విద్యలుగా ఉన్నాయన్నారు. బడ్జెట్‌పై ఎంతో నమ్మకం ఉన్న కోటి మంది అసంఘటిత రంగనికి చెందిన కుటుంబాలు ఉన్నాయని, వారి ఆశలు అడియాశలు అయ్యాయని చెప్పారు.
వికలాంగుల సంక్షేమానికి రూపాయి కూడా లేదు
వికలాంగుల సంక్షేమానికి బడ్జెట్‌లో రూపాయి కూడా కేటాయించలేదని కాంగ్రెస్ వికలాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య విమర్శించారు. వికలాంగుల హక్కుల చట్ట ప్రకారం బడ్జెట్‌లో ఐదు శాతం అంటే రూ.9100 కోట్లు రావాల్సి ఉంటుంది కానీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.
ఇది వికలాంగులను కించపరచడమే అవుతుందని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామన్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు వికలాంగుల సంక్షేమానికి బడ్జెట్ కేటాయించకపోవడం అంటే అది ఖచ్చితంగా జాతీయతను కించపరచడమే అవుతుందన్నారు. బంగారు తెలంగాణ కాదు ప్రజల బతుకులను నాశనం చేయడమే అవుతుందని ఆయన విమర్శించారు.