తెలంగాణ

బీజాపూర్‌లో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జూన్ 11: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో పోలీసులు, నక్సల్స్ మధ్య నువ్వా? నేనా? అన్నట్లుగా పోరు జరుగుతోంది. ఇరు వర్గాలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నాలు చేస్తుండటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంటోంది. రెండు రోజుల క్రితమే మావోయిస్టులు కొండగావ్ జిల్లాలో రాకెట్ లాంఛర్లతో ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీసుల క్యాంపుపై విరుచుకు పడ్డ సంగతి విదితమే. తాజాగా శుక్రవారం రాత్రి బీజాపూర్ జిల్లా మద్దేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగంపల్లి గ్రామంలో మద్దేడు జిల్లా పంచాయతీ సభ్యుడు మజ్జి రాంసాయ్‌ని మావోయిస్టులు దారుణంగా కాల్చి చంపారు. దీంతో బీజాపూర్ జిల్లా పోలీసులు మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. జిల్లాలోని గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో బుర్జీ అటవీప్రాంతంలో సిఆర్‌పిఎఫ్, జిల్లా పోలీసు బలగాలు మావోయిస్టులు నిర్మించిన 15 అడుగుల అమరవీరుల సంస్మరణ స్థూపాన్ని కూల్చారు. దండకారణ్యంలో మావోయిస్టులు నిర్మించిన అమరవీరుల స్థూపాలను ఆపరేషన్ గ్రీన్‌హంట్‌లో భాగంగా కూల్చి వేస్తున్న సంగతి పాఠకులకు విదితమే. గతంలోనూ రెండేళ్ల క్రితమే కిషన్‌జీని స్మరించుకుంటూ తెలంగాణ-్ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో నిర్మించిన భారీ స్థూపాన్ని పోలీసు బలగాలు కూల్చి వేశాయి. మావోయిస్టుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే క్రమంలో పోలీసు బలగాలు ఈ తరహా దాడులకు దిగుతున్నారు. మరో వైపు జంషెడ్‌పూర్‌లో పోలీసు కుటుంబానికి సంబంధించిన ఇంటికి మావోయిస్టులు నిప్పు పెట్టారు. గుడాబందా పోలీస్‌స్టేషన్ పరిధిలోని మురాకాటో గ్రామంలో దాదాపు 50 మంది సాయుధ నక్సల్స్ శనివారం ఇళ్ళలోకి ప్రవేశించి కుటుంబ సభ్యులను బయటకు పంపించి నిప్పు పెట్టారు. పోలీసు కుటుంబం ఊరు వదిలి వెళ్లాలని హెచ్చరించారు. ఈ ఘటనలతో భయానక వాతావరణం నెలకొంది. ఆధిపత్య పోరులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయోనన్న భయం ప్రజల్లో కన్పిస్తోంది.

చిత్రం నక్సల్స్ చేతిలో హతమైన రాంసాయ్ మజ్జి