తెలంగాణ

ఇక కాంగ్రెస్ పవర్ పాయింట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో నీటి ప్రాజెక్టులపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ధీటుగా కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను సిద్ధం చేసింది. అయితే దీనిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముందు ఏమైనా లోపాలు ఉన్నాయా? ప్రభుత్వం నుంచి, ఇతర ప్రతిపక్షాల నుంచి ఎటువంటి విమర్శలు ఎదుర్కొవాల్సి ఉంటుందన్న అంశాలను పరిశీలించేందుకు టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, సిఎల్‌పి నేత కె. జానారెడ్డి, టి.పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు సమావేశమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ‘ప్రివ్యూ’ను చూశారు. ఈ ప్రివ్యూను టి.పిసిసి ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వివరించారు. ప్రతి ప్రాజెక్టుపై క్షుణ్ణంగా పరిశీలన చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన జలయజ్ఞంలో ఏయే ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది?, ఏ మేరకు నిధులు విడుదల చేయడం జరిగింది? వాటి నిర్మాణం ఏ దశలో ఉన్నాయి?, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ప్రాజెక్టులు, వాటి స్థితిగతులు, మొబలైజేషన్ అడ్వాన్స్‌లు తదితర అంశాలను సంపూర్ణంగా పరిశీలించారు. సాధ్యమైనంత త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ప్రజల ముందు పెట్టాలని భావిస్తున్నారు. అయితే వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలి? అనే అంశం తేలాల్సి ఉంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ఎఐసిసి నాయకులను, అన్ని పార్టీల ముఖ్య నేతలనూ ఆహ్వానించాలని వారు చర్చించినట్లు సమాచారం.