తెలంగాణ

ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌దే గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 14: సీఎం కేసీఆర్ ప్రభుత్వం పాలన, పథకాల పట్ల తెలంగాణ ప్రజల నుండి లభిస్తున్న ఆదరణతో ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్‌ఎస్‌దేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 16న నల్లగొండలో నిర్వహించే నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎన్నికల సన్నాహాక సభ ఏర్పాట్లను గురువారం ఆయన రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, కంచర్ల భూపాల్‌రెడ్డిలతో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ వచ్చే నెలలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 16 పార్లమెంట్ స్థానాల్లో గులాబీ జెండా ఎగురబోతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల పిదప కేంద్రంలో టీఆర్‌ఎస్, ఫెడరల్ ఫ్రంట్‌లు నిర్ణయాత్మక శక్తిగా ఆవిర్భవించనున్నాయన్నారు. సీఎం కేసీఆర్ పాలన, పథకాలను కేంద్ర పాలకులతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదర్శనీయంగా తీసుకుంటున్నాయన్నారు. సీఎం కేసీఆర్ దార్శనికత, పరిపాలన సామర్ధ్యాన్ని అవగతం చేసుకున్న దేశ ప్రజలు కేసీఆర్ మార్క్ పాలన, పథకాలు దేశమంతా అమలు జరగాలని కోరుకుంటుకున్నారన్నారు. కేసీఆర్ పాలన మెచ్చిన ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు పోటీ పడుతున్నారన్నారు. టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సారధ్యం, ప్రసంగాలు కేడర్‌లో జోష్ నెలకొల్పుతుండగా పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు.
పార్టీ కార్యకర్తలను కేటీఆర్ సైనికులుగా తయారు చేస్తున్నారని, టీఆర్‌ఎస్‌ను వందేళ్లు నిలిచి, గెలిచే పార్టీగా సీఎం కేసీఆర్ పునాదులు వేస్తుండగా, కార్యకర్తలను సైనికులుగా కేటీఆర్ తయారు చేస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ 90శాతం స్థానాలను గెలుచుకోగా రానున్న పార్లమెంట్, మున్సిపల్, మండల, జిల్లా పరిషత్‌ల ఎన్నికల్లో వందశాతం విజయాలు అందుకోనుందని ఇందుకు ప్రతి కార్యకర్త తనవంతు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కరీంపాషా, నాయకులు సుంకరి మల్లేశ్‌గౌడ్, లోడంగి గోవర్ధన్, ఎంపీపీ దైద రజిత తదితరులు పాల్గొన్నారు.