తెలంగాణ

జగన్మోహినిగా లక్ష్మీనరసింహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, మార్చి 14: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు గురువారం స్వామివారు జగన్మోహిని అవతార అలంకార సేవలో అశ్వవాహన రూఢుడై భక్తులను పులకింపచేశారు. ఉ. 11 గంటలకు స్వామివారికి జగన్మోహినిగా అలంకార సేవ, రాత్రి 9 గంటలకు ఆశ్వవాహన సేవలను శాస్తయ్రుక్తంగా నిర్వహించారు. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన అమృతాన్ని లోకహితం కోసం రాక్షసులకు అందకుండా చేసేందుకు జగన్మోహిని రూపం దాల్చిన శ్రీమహావిష్ణువు సుర, అసురులను సమ్మోహనం చేసి యోగ్యులైన దేవతలకు అమృతాన్ని అందించారు. జగన్మోహిని రూపంలో అలంకృతులైన లక్ష్మీనరసింహుడు ధర్మానుసారం నడిచేవారికి అండగా ఉంటానంటూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధానార్చకులు నందీగల్ నరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యులు, యాజ్ఞికులు శ్రీనివాసాచార్యులు అలంకార సేవలను నిర్వహించి వాటి విశేషాలను భక్తులకు వివరించారు.
ఘనంగా ఎదుర్కోలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహుల తిరుకల్యాణోత్సవం ఘట్టానికి ముందుగా జరిపే ఎదుర్కోలు ఘట్టాన్ని బాల ఆలయంలో రాత్రి శాస్తయ్రుక్తంగా సంబరంగా నిర్వహించారు. లక్ష్మీనరసింహుడు పెండ్లికొడుకుగా ముస్తాబై అశ్వవాహనంపై మండపానికి చేరుకోగా, క్షీర సముద్ర తనయ అమ్మవారు లక్ష్మీదేవి ముత్యాల పల్లకిలో మండపానికి చేరారు. అనంతరం ఎదుర్కోలు ఘట్టంలో యాజ్ఞికులు, అర్చక పండితులు, పారాయణులు, అధికారులు వధూవరుల తరుపున రెండు బృందాలుగా ఏర్పడి స్వామి, అమ్మవార్ల పెళ్లిచూపులు, ప్రవర, వివాహ నిశ్చితార్థం, ముహూర్త నిశ్చయం, లగ్నపత్రిక రాసుకునే ప్రక్రియలను సంబరంగా నిర్వహించారు. ఎదుర్కోలు ఘట్టంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్‌రెడ్డి, ఈవో గీత, ధర్మకర్త బి.నరసింహమూర్తి, భక్తులు పాల్గొన్నారు.
నేడు తిరు కల్యాణోత్సవం
యాదాద్రి లక్ష్మీనరసింహుడి బ్రహోత్మవాల్లో నేడు శుక్రవారం ఎనిమిదవ రోజున బాల ఆలయంలో ఉదయం 10గంటలకు స్వామివారికి శ్రీరామ అలంకార సేవ, హనుమత్ వాహన సేవ, గజవాహన సేవలు నిర్వహిస్తారు. 11 గంటలకు బాల ఆలయంలోనే తిరుకల్యాణోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం వైభవంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారి కల్యాణోత్సవానికి సీఎం కేసీఆర్ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించాల్సివుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ దంపతులు ఈ దఫా కల్యాణోత్సవానికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు అందించనున్నారు. ఇప్పటికే యాదగిరీశుడి కల్యాణానికి తిరుమలేశుడి తరుపున ఏటా టీటీడీ అందించే పట్టువస్త్రాలు ఒకరోజు ముందుగానే అందించారు. తిరుకల్యాణోత్సవం పిదప రాత్రి 8 గంటలకు భక్తుల సందర్శనార్ధం కొండ దిగువన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహావైభవోత్సవ కల్యాణం నిర్వహించనున్నారు.
చిత్రం.. జగన్మోహిని అలంకార సేవలో యాదగిరీశుడికి హారతి నివేదన