తెలంగాణ

‘నాగర్‌కర్నూల్’ను కేసీఆర్‌కు కానుకగా ఇద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, మార్చి 14: వచ్చేనెల 11న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిని రికార్డు మెజార్టీతో గెలిపించి సీఏం కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని ఈ నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మంట్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. గురువారం శంషాబాద్‌లో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి మేనకోడలు పెళ్లికి హాజరైన వనపర్తి ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితోపాటు ఈ సెగ్మంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, అబ్రహం, గువ్వల బాలరాజు, కృష్ణమోహన్‌రెడ్డితోపాటు మాజీ మంత్రి జూపల్లికృష్ణారావు, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి మంద జగన్నాథం, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రాములు, నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి తదితరులు సమావేశమై పార్లమెంట్ ఎన్నికలపై చర్చించారు. అందిన సమాచారం ప్రకారం నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలవలేదని, ఈ ఎన్నికలలో ప్రత్యేక ప్రణాళికతో కలిసికట్టుగా పనిచేసి రికార్డు మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని, ఇందుకోసం ఇప్పటి నుంచే ముందుకు సాగాలని నిర్ణయించారు. ఎన్నికల వ్యూహరచన కోసం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికి సమావేశమై అవసరమైన వ్యూహరచన చేయడంతోపాటు ఎన్నికల ప్రచారంపై కార్యచరణ ప్రణాళికను రూపొందించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పగా, మిగతా వారు అంగీకరించినట్లు తెలుస్తున్నది.
చిత్రం.. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానంలో విజయం కోసం కార్యాచరణపై చర్చిస్తున్న
మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తదితరులు