తెలంగాణ

పరీక్ష కేంద్రాలను ముందే చూసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: పదో తరగతి విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలను ముందే చూసుకోవాలని , ఆఖరి నిమిషంలో అయోమయానికి గురికావద్దని పాఠశాల విద్య కమిషనర్ విజయకుమార్ సూచించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశామని పేర్కొన్న కమిషనర్ విజయకుమార్ ఈ సందర్భంగా టెన్త్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించమని పోలీసులకు చెప్పామని అన్నారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయిస్తున్నామని, పరీక్ష కేంద్రాలకు అర్ధగంట ముందే విద్యార్థులు చేరుకోవాలని అన్నారు. షెడ్యూల్డు సమయం కంటే ఐదు నిమిషాలు ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లో అనుమతించమని అధికారులకు సూచించామని అన్నారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు. 16వ తేదీ నుండి ప్రారంభం అవుతున్న పరీక్షలకు 5.52 లక్షల మంది హాజరవుతున్నారని అన్నారు. మార్చి 22న జరిగే ఇంగ్లీషు పేపర్ 2ను ఏప్రిల్ మూడో తేదీన నిర్వహిస్తామని చెప్పారు. హాల్‌టిక్కెట్లు అందరికీ జారీ చేశామని, హాల్‌టిక్కెట్లు అందని వారు, ఇంత వరకూ పొందని వారు ‘బీఎస్‌ఈ డాట్ తెలంగాణ డాట్ జీవోవీ డాట్ ఇన్ ’ అనే వెబ్ పోర్టల్ నుండి వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, నెట్ హాల్‌టిక్కెట్లను అనుమతించమని అధికారులకు సూచించామని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో వేసవిని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, రాష్టవ్య్రాప్తంగా 2563 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామిన చెప్పారు. ఎక్కడా కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా 144 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించామని, జవాబుపత్రాలను ఎవరూ బయటకు తీసుకువెళ్లడానికి వీలు లేదని పేర్కొన్నారు. ఆన్సర్ షీట్లపై గుర్తులు, దేవుళ్ల పేర్లు, ఇతర సింబల్స్, స్లోగన్స్ రాయడానికి వీలు లేదని, అలా రాస్తే ఆ పేపర్లను మూల్యాంకనం చేయబోమని అన్నారు.