తెలంగాణ

26 రాష్ట్రాల్లో 55 ఎంపీ సీట్లకు పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: సార్వత్రిక ఎన్నికల్లో 26 రాష్ట్రాలోని 55 పార్లమెంట్ స్థానాలకు సీపీఐ పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రకటించారు. గురువారం ముఖ్దం భవనంలో రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాట్లు జరుగుతోందన్నారు. ఈనెల 18వ తేదీలోపు ఉమ్మడి అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. బీజేపీ, ఎన్‌డీఏ పార్టీలను చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపు ఇచ్చారు. గడచిన పార్లమెంట్‌లో సీపీఐ పక్షాన పార్లమెంట్‌లో అనేక సమస్యలను ప్రస్తావించామన్నారు. దేశంలో వామపక్షాలు గెలవాల్సిన అవశ్యకత ఎంతో ఉందన్నారు. కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయడంపై సీపీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. కాశ్మీర్‌లో పార్లమెంట్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అదేక్రమంలో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయడం ఏమిటని ఆయన నిలదీశారు. ఎన్నికల ఫలితాల్లో కనీసం ఐదువేల ఓట్లు తేడా ఉంటే వీవీ ప్యాట్లును లెక్కించాలని తాము ఎన్నికల సంఘానికి సూచించామన్నారు. ప్రతిపక్షాలు పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెప్పడం దురదుష్టకరమన్నారు. తెలంగాణలోప్రతిపక్షాలను మానసికంగా దెబ్బతీయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం ఉమ్మడిగా పోటీ చేస్తాయన్నారు.