తెలంగాణ

ఐఈఐ స్వర్ణోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజనీర్స్ ఇండియా (ఐఈఐ) తెలంగాణ స్టేట్ సెంటర్ స్వర్ణోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో రెండు రోజుల పాటు ఖనిజ పరిశ్రమలు విధానాలపై జాతీయ స్థాయిలో సెమినార్ నిర్వహిస్తోంది. హైదరాబాద్ ఖైరతాబాద్‌లో నీటి పారుదల పీతామా మోక్షగుండం విశే్వశ్వరయ్య గ్ఞాపకార్థం ఖైరతాబాద్‌లో ఐఈఐ భవనంను ఏర్పాటు చేశారు. ఐఈఐ వందేళ్లు పూర్తి చేసుకుంది. ఖైరతాబాద్‌లోని ఐఈఐ లో ఇంజనీరింగ్, టెక్నాలజీకి సంబంధించిన సదస్సులు, వర్క్ షాప్‌లు, సెమినార్‌లతో రౌండ్ టేబుల్ సమావేశాలకు వేదికగా నిలిచిన ఐఈఐ ఎంతో మంది యువ ఇంనీర్లకు బాసటగా నిలిచింది. వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖ ఇంజనీర్లు ఇక్కడ జరిగే ప్రతి అంశంపై వివరించి ఇంజనీరింగ్, టెక్నాలజీ వంటి అంశాలపై వారు చేసిన పరిశోధనలకు సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్టులను సమర్పించడం జరుగుతుంది. దీంతో అనుభవం కలిగిన ఇంజనీర్ల అనుభవాలు, వారి ఉపాన్యాసాలు యువ ఇంజనీర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. ఈ సందర్భంగా ఐఈఐ, రామగుండం లోకల్ సెంటర్ మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఈఏఐ), ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు చెందిన మైనింగ్ ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ‘ ఖనిజపరిశ్రమలపై ఇటీవల వచ్చిన విధానాలు ’ అన్న అంశంపై అఖిల భారత జాతీయ స్థాయి సదస్సును ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే సదస్సు ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజనీర్స్ తెలంగాణ సెంటర్‌లో నిర్వహిస్తారు. ఐఈఐ సెంటర్‌లో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో జాతీయ సెమీనార్ నిర్వహణ కమిటీ కన్వీనర్, ఎన్‌ఎండీసీ మాజీ సీఎండీ బీ.రమేష్ కుమార్, కో కన్వీనర్ డాక్టర్ వెంకట రామయ్య ఈ వివరాలను వెల్లడించారు. భారత దేశంలో ఖనిజ సంపద ఎంతో ఉందని, ఖనిజ పరిశ్రమలు దేశ వ్యాప్తంగా అనేక మంది కార్మికులు జీవనం కొనసాగిస్తున్నారన్నారు. ఈ సదస్సుకు దేశ వ్యాప్తంగా మైనింగ్ ఇండస్ట్రీకి చెందిన 300 ప్రతినిధులు పాల్గొననున్నారు. దేశం నలుమూలల నుంచి ప్రముఖ ఇంజనీర్లు దాదాపు 13 ఉపాన్యాసలు ఈ సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. రెండు రోజుల పాటు కొనసాగనున్న సదస్సులో ఐదు సాంకేతిక సదస్సులను కూడా నిర్వహిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఈనెల 15వ తేదీన ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమయ్యే అఖిల భారత సెమినార్‌కు ముఖ్యఅతిథిగా కేంద్ర గనుల శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ రాజేశ్వర రావువిచ్చేసి సదస్సును ప్రారంభిస్తారు. గౌరవ అతిధులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గనులు, భూగర్భ శాఖ డైరెక్టర్ బీఆర్‌వీ సుశీల్ కుమార్, భారత మైనింగ్ ఇంజనీర్స్ సంఘం అధ్యక్షుడు అరుణ్ కుమార్ కోటారి, ఐఈఐ అలీండియ అధ్యక్షుడు టీఏం.గుణరాజాలు పాల్గొంటారు. ఈనెల 16న జరుగనున్న సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొంటారు. ఐఈఐ కేంద్రంలో జరిగిన విలేఖరుల సమావేశంలో సంస్థ చైర్మన్ జీ,రామేశ్వర రావు, కార్యదర్శి టీ.అంజయ్యలతో పాటు ఎస్.సూర్యనారాయణ, కేజే.అమర్‌నాథ్ పాల్గొన్నారు. పరిశ్రమల అభివృద్ధి కోసం ఈ సదస్సులో విధానాన్ని ఖరారు చేయనున్నారు. గనులు, భూగర్భ శాఖకు సంబంధించిన అంశాల్లో చదువుకున్న యువ ఇంజనీర్లకు ‘ఖనిజ సంపద వల్ల వాతావరణంపై చూపుతున్న ప్రభావం’ అన్న అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేయడం జరుగుతుందని సదస్సు కన్వీనర్ రమేష్ కుమార్ తెలిపారు.