తెలంగాణ

టీఆర్‌ఎస్ ఎన్నికల శంఖారావం రేపే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం శంఖారావం పూరించబోతున్నారు. ఎన్నికలు ఏవైనా కరీంనగర్ నుంచే శంఖారావాన్ని పూరించడం టీఆర్‌ఎస్‌కు సెంటిమెంట్. శాసనసభ ఎన్నికల ప్రచారానికి కూడా కరీంనగర్ నుంచే కేసీఆర్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకుగాను మిత్రపక్షం ఎంఐఎంకు హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని వదిలేసి మిగిలిన 16 స్థానాలను సాధించాలని టీఆర్‌ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రంలో ఎన్డీయే, యుపీఏ ఏ కూటమికి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడటంతో తాము గెలుచుకోబోయే 16 స్థానాలతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో టీఆర్‌ఎస్ కీలక భూమిక పోషించబోతుందని టీఆర్‌ఎస్ భావిస్తోంది. టీఆర్‌ఎస్ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం టీఆర్‌ఎస్ ఎంపీలనే గెలిపించాలని పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహాక సమావేశాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సారు...కారు...్ఢల్లీలో సర్కార్ నినాదంగా పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తున్నామని కూడా కేటీఆర్ ప్రకటించారు. శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయాన్ని చేకూర్చినట్టుగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే స్ఫూర్తితో టీఆర్‌ఎస్ ఎంపీలను గెలిపించాలని పార్టీ అధినేత కేసీఆర్ కరీంనగర్ ఎన్నికల ప్రచార సభ నుంచి పిలుపు ఇవ్వబోతున్నారు. ఇలా ఉండగా ఎన్నికల ప్రచారానికి శంఖారావాన్ని పూరించడానికి వెళ్లడానికి ముందు సిట్టింగ్ ఎంపీలతో సమాలోచనలు జరుపనున్నట్టు అధినేత కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఆదివారం నుంచి కరీంనగర్‌లో ఎన్నికల ప్రచార సభ ఉండటంతో ఆలోగా శనివారం మధ్యాహ్నం ఎంపీలతో సీఎం కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. ఈ కీలక భేటీలోనే ఎంపీ అభ్యర్థుల ఖరారు దాదాపు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఒకరిద్దరు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ ఇవ్వడం లేదని కూడా కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ఒకరిద్దరు ఎవరన్నదీ కూడా శనివారం నాటి భేటీలో వెల్లడించనున్నారు. దీంతో సిట్టింగ్ ఎంపీలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్‌లో ఆదివారం జరుగనున్న తొలి ఎన్నికల ప్రచార సభను టీఆర్‌ఎస్ అధిష్టానం ప్రతిష్టాకరంగా తీసుకుంది. సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఆ జిల్లాకు చెందిన మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ వారం రోజులుగా కరీంనగర్‌లోనే మకాం పెట్టి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 19న నిజామాబాద్‌లో జరుగనున్న ఎన్నికల ప్రచార రెండో సభను విజయవంతానికి ఎంపీ కవిత ఇప్పటికే నిజామాబాద్‌లో మకాం పెట్టారు. వీరి అభ్యర్థిత్వాలతో పాటు ఇతర అభ్యర్థుల ఖరారులో నెలకొన్న ఉత్కంఠకు శనివారం తెరపడనుందని పార్టీ వర్గాల సమాచారం.