తెలంగాణ

‘చే’జారి బేజారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: రోజుకో ఎమ్మెల్యే ‘చే’జారుతుండడంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల ముందు పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి చేరుతుండడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలవరపడుతున్నారు. ఇప్పటికే రేగ కాంతారావు (పినపాక), ఆత్రం సక్కు (అసిఫాబాద్), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్), హరిప్రియా నాయక్ (ఇల్లందు) పీ సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), తాజాగా ఉపేందర్ రెడ్డి (పాలేరు) టీఆర్‌ఎస్‌లో చేరేందుకు మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే. ఇంకా టీడీపీ తరఫున ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలలో సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో చర్చించి, పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇక్కడితో ఆగిందా అంటే ఇంకా పలువురిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, పీ వీరయ్య, వనమా వెంకటేశ్వర రావు, జాజుల సురేందర్‌పైనా పార్టీ నాయకులు అనుమానపడుతున్నారు. వీరు కూడా చేజారితే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రద్దు అవుతుంది. సీఎల్‌పి నాయకుడైన భట్టివిక్రమార్క ప్రతిపక్ష హోదా కోల్పోతారు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే వంద ఎమ్మెల్యేలకు 10 శాతం (అంటే 10 మంది) ఎమ్మెల్యేలు ఉండాలి. అంతేకాకుండా అసెంబ్లీ ఆవరణలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్‌పి) కార్యాలయాన్నీ ఖాళీ చేయాల్సి ఉంటుంది. పార్టీ ఎమ్మెల్యేలు ‘చే’జారుతుంటే పార్టీ అధిష్ఠానం కానీ రాష్ట్ర నాయకత్వం గానీ నిలువరించలేకపోతున్నదని కాంగ్రెస్ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ప్రలోభాలకు గురయ్యే వారికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఎందుకు ఇచ్చారు? అని వారు ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేసే ద్వితీయ శ్రేణి నాయకులను, పార్టీ కార్యకర్తలను విస్మరించి, ఫిరాయింపుదారులకు టిక్కెట్లు ఇస్తే ఇలాగే ఉంటుందని వారు విమర్శిస్తున్నారు.