రాష్ట్రీయం

క్షీణించిర ముద్రగడ ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 14: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో కొనసాగిస్తున్న ఆమరణ దీక్ష మంగళవారానికి ఆరో రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం ఒక పక్క బాగా క్షీణిస్తుండగా, మరోపక్క సమస్య పరిష్కారానికి కోసం అధికారుల అధ్వర్యంలో చర్చలు మొదలయ్యాయి. ముద్రగడ సతీమణి, కోడలు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ముద్రగడ ఆరోగ్యంపై మాత్రం ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహిస్తే తప్ప స్పష్టత ఇవ్వలేమని చెప్పారు. బలవంతంగా వైద్యం చేయాల్సిన పరిస్థితి వున్నా, చర్చలు మొదలైన దృష్ట్యా తాము మిన్నకుండిపోయామని వైద్యులు చెబుతున్నారు.
మరోపక్క ముందుగా రక్తపరీక్షలకు అంగీకరించాల్సిందిగా ముద్రగడను ఒప్పించే ప్రయత్నాలు మంగళవారం జరిగాయి. కాపునేతలు విజయవాడకు చెందిన నాగేంద్ర, భీమవరానికి చెందిన ఆరేటి ప్రకాష్, అమలాపురం నుంచి మిండుగుదుటి మోహన్ తదితరులు ముద్రగడను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో కలిశారు. వీరంతా ముందుగా రాజమహేంద్రవరంలో ఒక చోట సమావేశమై చర్చించుకుని, అనంతరం ముద్రగడను కలిసి వైద్య పరీక్షలకు అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు.
కాగా ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్, కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ముద్రగడతో చర్చలు జరిపారు. ప్రధానంగా కేసుల ఎత్తివేతతో పాటు మరి కొన్ని డిమాండ్లను ముద్రగడ తెరపైకి తీసుకొచ్చారంటున్నారు. కేసుల విషయంలో తప్ప మిగిలినన్నీ పరిష్కారయోగ్యంగానే ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ప్రధాన డిమాండ్ అయిన రిజర్వేషన్ అంశం కూడా ఈ చర్చల్లో చేరినట్టు చెబుతున్నారు. అవసరమైతే ఆగస్టులో మధ్యంతర నివేదికను ఇప్పిస్తామనే ప్రతిపాదన కూడా వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. కేసుల ఎత్తివేత విషయంలో కొన్ని న్యాయపరమైన చిక్కులు యంత్రాం గం లేవనెత్తడంతో ప్రతిష్ఠంభన తలెత్తినట్టు తెలుస్తోంది. తాను సజీవంగా బయటకు రావాలంటే డిమాండ్లన్నీ అంగీకరించాల్సిందేనని ముద్రగడ కరాఖండిగా చెప్పినట్టు తెలిసింది. దీంతో దిశా నిర్దేశం కోసం జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించినట్టు సమాచారం. మంగళవారం సా యంత్రం ఆరున్నర గంటల సమయంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి 202 గదిలో ఉద్విగ్న వాతావరణం మధ్య చర్చల ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. రాత్రికి గానీ, బుధవారానికి గానీ కొలిక్కి రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు