తెలంగాణ

వీళ్లకు పాలించే అర్హత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలను ఓడించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యిదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ముఖ్దూమ్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని వదిలేసి సొంత అజెండాను అమలు చేస్తున్న ఈ ప్రభుత్వాలు పాలించే అర్హత కోల్పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 75 శాతం మీడియా కార్పొరేట్ రంగం చేతిలో ఉందన్నారు. కేంద్రంలోని బీజెపీ ప్రభుత్వం మీడియాను గుప్పెట్లో పెట్టుకుందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బీజేపీ ప్రయత్నాలను అడ్డుకోవడానికి పార్లమెంట్ ఎన్నికలను ప్రధాన వేదికగా సీపీఐ పని చేస్తుందని సురవరం చెప్పారు. సోషల్ మీడియాను బీజేపీ ఎన్నికల ప్రచార అస్త్రంగా వినియోగించుకుంటోందని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజాతంత్ర శక్తుల మీద ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజెపీ, టీఆర్‌ఎస్ పార్టీలను ఓడించడమే ప్రధాన లక్ష్యంగా వామపక్ష, ప్రజాతంత్ర , లౌకిక, ప్రగతిశీల శక్తులతో కలసి పోటీ చేయాలని సురవరం పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో నిరంకుశ ధోరణులు పెచ్చిరిల్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు శాసనసభలో బలం ఉన్నప్పటికీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఫిరాంయింపులకు ప్రోత్సహంచడం దారుణమని చాడ అన్నారు. ఎర్రజొన్న, పసుపు రైతులు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో దిక్కుతోచని స్థితుల్లో ఉన్నారన్నారు. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు స్థానాల్లో సీపీఐ పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. గురువారం సీపీఐ రాష్ట్ర స్థాయి సమావేశంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు వివిధ అంశాలపై చర్చించినట్టు ఆయన తెలిపారు. సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు అజీజ్‌పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, కార్యదర్శులు తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు, పశ్య పద్మ, గుండా మల్లేష్, నక్కా బాలమల్లేష్ పాల్గొన్నారు.