తెలంగాణ

అమీర్‌పేట-హైటెక్ సిటీ మధ్య రేపోమాపో మెట్రో పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: అమీర్‌పేట, హైటెక్‌సిటీల మధ్య రేపోమాపో మెట్రోరైలు పరుగులు తీయనుంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, ఎలాంటి ఆర్భాటం, ప్రచార హడావుడి లేకుండా సింపుల్‌గా ప్రజలకు ఈ కారిడార్‌లో మెట్రోప్రయాణాన్ని అందుబాటులోకి తేవాలని హైదరాబాద్ మెట్రోరైలు శుక్రవారం ప్రకటించింది. కానీ అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు సుమారు పది కిలోమీటర్ల పొడువున ఏర్పాటు చేసిన ఈ కారిడార్‌లో ఒకటి రెండు మెట్రో స్టేషన్లలో తుది దశ పనులు మినహా ఈ కారిడార్ మొత్తం కూడా నాలుగు నెలల క్రితమే పూర్తయ్యింది. ఆ గడిచిన మూడు నెలలుగా ఈ కారిడార్‌లో ట్రయల్ రన్‌ను కూడా విజయవంతంగా నిర్వహించారు. కమిషనర్ ఆఫ్ మెట్రోరైలు సేఫ్టీ (సీఎంఆర్‌ఎస్) అనుమతులు రాకపోవటంతో అధికారులు ఈ రూట్‌లో మెట్రో సేవలను అందుబాటులోకి తేలకపోయారు. కానీ ప్రస్తుతం సీఎంఆర్‌ఎస్ నుంచి క్లియరెన్స్ రావటం, మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి హడావుడి లేకుండానే కొద్దిరోజుల్లోనే ఈ రూట్‌లో మెట్రోరైలును ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు హైదరాబాద్ మెట్రోరైలు అధికారులు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. హైటెక్‌సిటీ, అమీర్‌పేటతోపాటు మధురానగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 5, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పెద్దమ్మగుడి, ధుర్గం చెరువు, హైటెక్‌సిటీ స్టేషన్లు ఇందుకు సిద్ధమయ్యాయి. మెట్రోరైలు అందుబాటులోకి వస్తే నిత్యం రద్దీగా ఉండే అమీర్‌పేట, హైటెక్‌సిటీ రూట్‌లో ఎక్కువ మంది ఐటీ నిపుణులు ఈ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది. ఫలితంగా ట్రాఫిక్ సమస్య కూడా కొంత వరకు తగ్గుముఖం పడుతుందన్న అంచనాలున్నాయి.
రెండు కారిడార్లలో 56 కిలోమీటర్ల ప్రయాణం
ఇప్పటికే కారిడార్ నెంబర్ వనలోని ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్ వరకు సుమారు 29 కిలోమీటర్లు, కారిడార్ నెంబర్ 3లోని నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు దాదాపు 17 కిలోమీటర్ల పొడువున మొత్తం 46 కిలోమీటర్ల మెట్రోప్రయాణం నగరవాసులకు అందుబాటులో ఉండగా, ఇపుడు పది కిలోమీటర్ల కారిడార్ అమీర్‌పేట హైటెక్‌సిటీ అందుబాటులోకి వస్తే మెట్రో ప్రయాణం మొత్తం 56 కిలోమీటర్లకు పెరుగుతోంది. ఇక సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి పాతబస్తీ ఫలక్‌నుమా వరకు ఏర్పాటు చేస్తున్న కారిడార్ నెంబర్ 2లో ఇప్పట్లో మెట్రోరైలు పరుగులు తీసే అవకాశం లేదు. కానీ జేబీఎస్ నుంచి గౌలీగూడ సీబీఎస్ వరకు పనులు జోరుగా సాగుతున్నందున మరో సంవత్సర కాలంలో మెట్రో పరుగులు తీసే అవకాశాలున్నట్లు చెప్పవచ్చు.