తెలంగాణ

పంటలపై సర్వే చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంటలపై సమగ్ర సర్వే చేయాలని జిల్లాల్లోని వ్యవసాయ శాఖ అధికారులను ఈ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి కోరారు. వ్యవసాయ శాఖాధికారులతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ) ప్రతి గ్రామంలోని ప్రతి ఒక్క రైతును కలిసి వారికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాలన్నారు. రైతులకు సం బంధించి 39 అంశాలను సేకరించాల్సి ఉంటుందన్నారు. ప్రొఫార్మాలో పార్ట్-ఏ, పార్ట్-బీ అని ఉం టాయని గుర్తు చేశారు. పార్ట్-ఏ లో రైతుల ఆధార్ కార్డు వివరాలు పొందుపరచాలన్నారు. పార్ట్-బీలో రైతుల చదువు, పండించే పంటలు, సాగునీటి సరఫరా వివరాలు, నేలల స్వభావం, వ్యవసాయ యాంత్రీకరణ, పంట రుణాలుంటే వాటి వివరాలు, పంటల బీమా, సేంద్రీయ విధానంలో సాగు చేస్తే అందుకు సంబంధించిన వివరాలు తదితర సమాచారాన్ని పొందుపరచాలన్నా రు. ఈ నెల 25 వరకు ఈ మేరకు సమాచారాన్ని సేకరించి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. ఎన్‌ఐసీ ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో రూపొందించబోయే పథకాలు, కార్యక్రమాలన్నీ రూపొందించేందుకు రైతుల సమగ్ర సమాచారం అవసరమని పార్థసారథి తెలిపారు. ప్రధాని కిసాన్ పథకంపై కూడా వాకబు చేశారు. వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా టూర్‌లో ఉండటంతో వరంగల్ నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
త్వరలో వ్యవసాయ విధానం
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ‘సమ గ్ర వ్యవసాయ విధానా’న్ని రూపొందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. సచివాలయంలో శనివారం ఆయన ఉన్నతాధికారులో సమీక్షా సమావేశం నిర్వహంచారు. వ్యవసాయ రం గం అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అ మలు చేస్తోందన్నారు. పంటల ఉత్పత్తి పెంచడంతో పాటు రైతుల ఆదాయం పెంచాలన్న ఉద్దేశంతోనే ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. వ్యవసాయ ముసాయిదా రూపొందించే బా ధ్యతను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) కు అప్పచెప్పామన్నారు. త్వరలోనే వ్యవసా య విధానాన్ని ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో టీఎస్‌ఎస్‌ఓసీఏ డైరెక్టర్ డాక్టర్ కేశవు లు వ్యవసాయ విశ్వవిద్యాలయం రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్, ఎస్‌బీఐ జనరల్ మేనేజర్ డాక్టర్ భగవాన్ త దితరులు పాల్గొన్నారు.

చిత్రం.. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న పార్థసారథి