తెలంగాణ

పెరుగుతున్న ఎన్‌ఆర్‌ఐ మోసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట, మార్చి 16: ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) మన దేశంలోని మహిళలను వివాహం చేసుకుని మోసం చేస్తున్నారని, ఇటీవల ఇలాంటి మోసాలు పెరిగాయని హైకోర్టు న్యాయమూర్తి సంజయ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా మోసపోయన బాధితుల పిల్లలు చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని, విదేశీ, స్వదేశీ చట్టాలను క్రోడీకరించి మహిళలకు సత్వర న్యాయం కలిగేలా ప్రయత్నాలు చేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సంజయ్‌కుమార్ అన్నారు. హన్మకొండలోని వాగ్దేవీ ఆడిటోరియంలో తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ లాయర్స్ వరంగల్ టీం ఆధ్వర్యంలో శనివారం ఒక రోజు సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సంజయ్‌కుమార్ హాజరై మాట్లాడారు. మన దేశంలోని మహిళలు ప్రవాస భారతీయులను వివాహం చేసుకునే క్రమంలో వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. జిల్లా జడ్జి తిరుమలాదేవీ మాట్లాడుతూ ప్రవాస భారతీయుల వివాహాలు, సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై పలు విషయాలను తెలిపారు. కేయూ న్యాయ కళాశాల విశ్రాంత ప్రొఫెసర్ పద్మ మాట్లాడుతూ దేశీయ మహిళల భద్రత గురించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ తీరుతెన్నులు, సంబంధిత మార్పులను ఉపయోగించుకోవాలన్నారు. తరణీ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు మమతారఘువీర్ బాధితుల కష్టాలు, సమస్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రవాస భారతీయుల వివాహాలపై తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సమతారెడ్డి, జయ, జనార్థన్, నర్సింగరావు, విజయలక్ష్మీ, ఇందిర తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. సమావేశంలో మాట్లాడుతున్న న్యాయమూర్తి సంజయ్‌కుమార్