తెలంగాణ

రాష్ట్రపతి పాలన అవసరం : భట్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్‌పి) నేత మ ల్లు భట్టివిక్రమా ర్క అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎ మ్మెల్యేలను వెంట నే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలను రద్దు చేయాలని తాము త్వరలో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసి కోరనున్నామని ఆయన శనివా రం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ముఖ్యమం త్రి కే. చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుం డా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. నలుగురైదుగురు ఎమ్మెల్యేలను కలుపుకుంటే ఏమీ కాదన్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలను మంత్రిగా చేసినప్పుడు చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదన్నారు. గవర్నర్ ఇలాం టి ఫిరాయింపులను అడ్డుకోవాలని అన్నారు. రాజ్యాం గ వ్యతిరేక పాలన చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని, అవసరమైతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని భట్టి డిమాండ్ చేశారు. అవినీతి సొమ్ము తో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించా రు. ప్రభుత్వంపై దశల వారీగా ఉద్యమిస్తామని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర రాష్ట్ర వ్యాప్తం గా నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. మిషన్ భగీరథ, ప్రాజెక్టు రీ-డిజైన్‌లపై జరిగిన అవినీతి గురించి ప్రజలకు వివరిస్తామని ఆయన చెప్పారు.
చిత్రం..గాంధీ భవన్‌లో మాట్లాడుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క