తెలంగాణ

కుటుంబ పార్టీలుగా ప్రాంతీయ పార్టీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలుగా మారిపోయాయని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ విమర్శించారు. ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే ఏ కూటమీ సుస్థిర పాలన అందించలేదని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. సుస్థిర పాలన కేవలం బీజేపీ హయాంలోనే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు ప్రాంతీయ పార్టీలను, ఫెడరల్ ఫ్రంట్‌ను ఆదరించరని ఆయన అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లో ఇప్పటికే ప్రాంతీయ పార్టీలు కనుమరుగైనట్లు ఆయన గుర్తుచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్‌ఎస్-బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్నారు. కాంగ్రెస్-టీఆర్‌ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. ఈ కారణంగానే కాం గ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ఫిరాయింపుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ నేత శ్రీ్ధర్‌కు ప్రధాని అభినందనలు
దేశంలో సురక్షిత పరిస్థితులను నెలకొల్పేందుకు బీజేపీ చేపట్టిన ‘మై భీ చౌకీదార్’ కార్యక్రమాన్ని ఉత్సాహంగా, చురుగ్గా నిర్వహిస్తున్న పార్టీ ఖైరతాబాద్ నాయకుడు కేశబోయిన శ్రీ్ధర్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.