తెలంగాణ

ఉత్తమ్‌కు కొత్త సమస్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓ కొత్త సమస్య వచ్చిపడింది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ఖరారు విషయంలో పార్టీ అధిష్టానాన్ని, పార్టీ ఎన్నికల కమిటీని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ, ఆయన మెడలోనే నల్లగొండ లోక్‌సభ సీటు పూల దండ వే యాలని అధిష్టానం యత్నించింది. అయితే ఉత్తమ్ లోక్‌సభకు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచలేదని సమాచారం. ఎంపీగా గెలుపొందితే మళ్ళీ హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనా మా చేయాల్సి వస్తుందని, దీంతో వచ్చే ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడే ప్రమా దం ఉందని ఆయన అభిప్రాయం. అ లాంటి సమయంలో ఆ అసెంబ్లీ సెగ్మెంట్‌ను కాపాడుకోవడం కష్టంగా ఉం టుందని ఆయన అధిష్ఠానానికి నచ్చజెప్పినట్లు సమాచారం. గతంలో ఎమ్మెల్సీలకు సీట్లు ఇచ్చామని, ఎమ్మెల్యేగా గెలుపొందాక ఎమ్మెల్సీ సీటును కోల్పోయామని ఆయన లోగడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదంతాన్ని ఉదహరించినట్టు తెలుస్తున్నది. దీంతో నల్లగొండ లోక్‌సభకు అభ్యర్థి ఎవరు అనే చర్చ జరుగుతున్నది. కాగా, పార్టీ రాష్ట్ర నాయకత్వం మాత్రం నల్లగొండ లోక్‌సభ సీటును నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌కు ఇచ్చి, భువనగిరి లోక్‌సభ సీటును మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డికి ఇస్తే బాగుంటుందని సూచించినట్లు సమాచారం. ఇక మల్కాజిగిరి లోక్‌సభ నుంచి పోటీ చే సేందుకు మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన ఆ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులందరినీ కలుసుకుంటున్నారు. ఇక కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్ ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. చేవెళ్ళ ఎంపీ కొండా విశే్వశ్వర్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నందున ఆయన ఇప్పటికే ప్రచారంలో ముందున్నారు. కాగా, కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా జాబితాను ప్రకటించాల్సి ఉంది.