తెలంగాణ

ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ ప్రయత్నిస్తోంది. 2014 సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో 69 శాతం పోలింగ్ జరగ్గా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 73కు చేరింది. లోక్‌సభ ఎన్నికల్లో దీన్ని మరింత పెంచేందు కు ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి (సీఈఓ) రజత్ కుమా ర్ ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం సాధారణంగా తక్కువగా ఉంటోంది. ఇది 50 శాతానికి మించడం లేదు. దీనిపై అధ్యయనం చేసి, లోటుపాట్లను గుర్తించి, ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో లోక్‌సభ పోలింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు చేయడంలో సీఈఓ రజత్ కుమార్ నిమగ్నమయ్యారు. ఓటర్ల తుది జాబితా ఇప్పటికే ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం 2,95,18,964 మంది ఓటర్లు ఉన్నారు. మరో 3,38,726 దరఖాస్తులు వచ్చాయని, ఈ నెల 23 వరకు వీటిని పరిశీలించి, అర్హత ఉన్న వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు యత్నిస్తున్నారు. ఈ నెల 25న తుది ఓటర్ల జాబితాతో పాటు సప్లిమెంటరీ జాబితాను ప్రకటించాలని నిర్ణయించారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2.98 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఈ నెల 28 తర్వాత బూత్ లెవెల్ అధికారులు (బీఎల్‌ఓ) ఫొటోతో కూడిన ఓటర్ల స్లిప్పులను ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పంపిణీ కాని ఓటర్ల స్లిప్పులు పోలింగ్ బూత్ వద్ద పోలింగ్ సమయంలో ఉంచాలని, స్లిప్పులు అందని వారు ఓటువేసే సమయంలో వాటిని తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ సమయంలో ఓటర్ స్లిప్పుతో పాటు ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు (ఎపిక్) తీసుకు రావాల్సి ఉంటుంది. అయితే ఎపిక్ కార్డు లేని వారు ఎన్నికల కమిషన్ గుర్తించిన 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాన్ని తీసుకువస్తే సరిపోతుందని ప్రచారం చేస్తున్నారు. 2018 నవంబర్‌లో జరిగిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ వరకు పేర్లు నమోదు చేసుకున్న వారికి ఎపిక్ కార్డులు ఇచ్చారు. కొత్తగా పేర్ల నమో దైన వారిలో ఇప్పటికే 3లక్షల మందికి ఎపిక్ కార్డులు ఇవ్వగా, మిగతా 14 లక్షల మంది ఓటర్లకు దశలవారీగా ఇవ్వాలని నిర్ణయించారు. ఎవరైన ఎపిక్ కార్డులు పోగొట్టుకుని ఉంటే, ‘మీ సేవ’లో 25 రూపాయలు చెల్లించి కొత్త ఎపిక్ కార్డు తీసుకునే ఏర్పాట్లు చేశారు.
20 నియోజకవర్గాల్లో ఈవీఎంల నిల్వ
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్‌లలో చాలావరకు లోక్‌సభకు ఉపయోగిస్తున్నారు. 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు నడుస్తుండటంతో కేసులు పరిష్కారం అయ్యే వరకు వీటిని స్ట్రాంగ్ రూంలలో భద్రపరుస్తారు. తెలంగాణ రాష్రానికి అవసరమైన ఈవీఎంలను ఈసీఐఎల్, బీఈఎల్ సంస్థలు సరఫరా చేస్తోంది. లోక్‌సభకు ఉపయోగించే ఈవీఎంలను తనిఖీ చేస్తున్నారు. థర్డ్‌పార్టీ కూడా వీటి సమర్థత, నాణ్యతను పరిశీలించే ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల పనితీరుకు ‘మాక్‌పోల్’ కూడా నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలను కూడా ఆహ్వానించి మాక్‌పోల్ సక్రమంగా ఉందో లేదో చూపిస్తారు. పోలింగ్‌కు ముందే జిల్లా కలెక్టర్లు మొదటిసారి ర్యాండమ్‌గా చెక్ చేసే ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత రిటర్నింగ్ అధికారులు కూడా ర్యాండమ్‌గా చెక్ చేస్తారు. లోక్‌సభ ఎన్నికలకు 54,953 బ్యాలెట్ యూనిట్లు, 40,038 కంట్రోల్ యూనిట్లు, 41,356 వీవీ ప్యాట్‌లు అందుబాటులో ఉన్నాయని సీఈఓ ఒక సందర్భంలో తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 1,85,600 మంది సిబ్బందిని నియమించుకుంటున్నారు.
నామినేషన్‌తో పాటు ఏడు డాక్యుమెంట్లు..
లోక్‌సభకు పోటీ చేసేందుకు నామినేషన్ వేసే అభ్యర్థులు ప్రధానంగా ఏడు రకాల డాక్యుమెంట్లను రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) రజత్ కుమార్ తెలిపారు. ఆదివారం ఈ మేరకు ఒక లేఖను మీడియాకు విడుదల చేశారు. నామినేషన్‌తో పాటు సమర్పించాల్సిన డాక్యుమెంట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఫాం 26 ద్వారా అఫిడవిట్ ఇవ్వాలి. అభ్యర్థిపై ఏవైనా కేసులు నమోదు అయ్యాయా, ఉంటే కేసుల వివరాలు రాయాలి. ఆస్తులు ఏమైనా ఉన్నా యా, ఉంటే ఎక్కడెక్కడ ఎంత మేరకు ఉన్నాయో అఫిడవిట్‌లో రాయాల్సి ఉంటుంది.
ఎన్నికల కమిషన్ 2003 మార్చి 27 న జారీ చేసిన ఆర్డర్ ప్రకారం మరొక అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది.
ఒక లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేసే అభ్యర్థి వేరే లోక్‌సభ స్థానం పరిధిలో ఓటర్ అయి ఉంటే సంబంధిత ఓటర్ల జాబితాలో అభ్యర్థి పేరు ఉన్న కాపీని ఇవ్వాల్సి ఉంటుంది.
రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసే వారు ఫాం-ఏ, ఫాం-బీ లను సమర్పించాల్సి ఉంటుంది.
ఎస్‌సీ/ఎస్‌టీలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
ప్రతి ఒక్క అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. జనరల్ అభ్యర్థులు అయితే 25 వేల రూపాయలు, ఎస్‌సీ, ఎస్‌టీలు అయితే 12,500 రూపాయలు చెల్లించాలి.
వీటితో పాటు ప్రతిజ్ఞాపత్రం కూడా సమర్పించాల్సి ఉంటుంది.