తెలంగాణ

జాతీయ ప్రవేశ పరీక్షలకు ఉచితంగా వీడియో స్టడీ మెటీరియల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: జాతీయ ప్రవేశపరీక్షలు, ఐఐటీ-జేఈఈ, ఎంసెట్ విద్యార్థులు, కాలేజీలు ఉచితంగా ఆన్‌లైన్‌లో స్టడీ మెటీరియల్ పొందేందుకు, ఆన్‌లైన్‌లో ప్రాక్టీస్ టెస్టులు రాసేందుకు వీలుకల్పిస్తున్నట్టు ఇరుడెక్స్ సంస్థ ప్రకటించింది. ఇరుడెక్స్ ప్లాట్‌ఫామ్‌ను ఫౌండింగ్ కమిషనర్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కేఎస్ శర్మ, ఫౌండింగ్ కమిషనర్ డాక్టర్ సీ వీరేందర్, సైకాలజిస్టు విజయ్ వల్లభనేని ఈ సందర్భంగా మాట్లాడుతూ యుఎస్‌ఏకు చెందిన ఎడ్యుటెక్ కంపెనీ ఇరుడెక్స్ కే-12 విభాగపు విద్యార్ధులకు అవసరమైన పరిష్కారాలను సంస్థ అందిస్తోందని పేర్కొన్నారు. చాలా మంది అభ్యర్ధులకు కంప్యూటర్ ఆధారిత అభ్యాస వాతావరణం లేక ఇబ్బందులు పడుతుంటారని, అలాంటి వారికి ఈ వేదిక ఎంతో ఉపయుక్తం అవుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఐదు వేలకు పైగా డిజిటల్ క్లాస్ రూమ్‌ల ద్వారా రెండు లక్షల మందికి పైగా విద్యార్ధులు మహోన్నత కంటెంట్, ప్రాక్టీస్ మెటీరియల్ ద్వారా ప్రయోజనం పొందుతారని అన్నారు. జేఈఈ, ఎంసెట్, నీట్ కానె్సప్ట్ రీసోర్సెస్ , ఇతర విద్యా మెటీరియల్ అందిస్తున్నామని వారు చెప్పారు. ఎస్‌సీఈఆర్‌టీ , ఎన్‌సీఈఆర్‌టీ బోర్డులు సర్టిఫై చేసిన కే-12 కంటెంట్, స్టడీ మెటీరియల్‌కు సీబీఎస్‌ఈ, టీఎస్‌ఎస్‌బీ, ఎపీఎస్‌బీ కరిక్యులమ్‌ను మ్యాపింగ్ చేశామని అన్నారు. 800 గంటలకు పైగా టాపిక్ ఆధారిత వీడియో కంటెంట్ అందుబాటులో ఉందని అన్నారు. రెండు లక్షలకు పైగా ప్రశ్నలు, సమాధానాలు ఇందులో ఉన్నాయని, ఎంపీసీ, బైపీసీ గ్రూపులు, ఇతర ప్రవేశపరీక్షల మెటీరియల్ కూడా ఉందని వారు చెప్పారు.