తెలంగాణ

ఇద్దరు చీఫ్ సూపరింటెండెంట్ల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18:పదో తరగతి పరీక్షల్లో అక్రమాలకు వీలుకల్పించిన ఇద్దరు చీఫ్ సూపరింటెండెంట్లు, ఒక డిపార్టుమెంటల్ ఆఫీసర్‌ను విధుల నుండి తొలగించారు. మరో 14 మంది ఇన్విజిలేటర్లపై చర్యలు తీసుకున్నారు. ఒక ఆఫీసు సబార్టినేట్‌ను కూడా విధుల నుండి తొలగించినట్టు పరీక్షల డైరెక్టర్ బీ సుధాకర్ తెలిపారు. టెన్త్ పరీక్షలకు 5,07,591 మంది హాజరయ్యారని, 1878 మంది మాత్రమే గైర్హాజరయ్యారని అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, జిల్లా స్థాయి అబ్జర్వర్లు 903 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారని పరీక్షలు ప్రశాంతగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
28 వరకూ ఓపెన్ స్కూలింగ్‌కు గడువు
ఓపెన్ స్కూలింగ్ ద్వారా ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు దరఖాస్తు చేసుకునేందుకు తత్కాల్ పద్ధతిలో ఈ నెల 28 వరకూ గడువు విధించినట్టు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 22 నుండి ఓపెన్ స్కూలింగ్‌లో టెన్త్ పరీక్షలు రాసే వారు 500 రూపాయిలు, ఇంటర్ పరీక్షలు రాసేవారు వెయ్యి రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 11న జేఈఈ ఎగ్జామ్ లేదు
ముందుగా ప్రకటించిన విధంగా ఏప్రిల్ 11న జేఈఈ మెయిన్ ఎగ్జామ్ లేదని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ప్రకటించింది. బీ ఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల వారికి పేపర్-2ను ఏప్రిల్ 7న నిర్వహిస్తారు. పేపర్-1 పరీక్షను ఏప్రిల్ 8,9,10,12 తేదీల్లో నిర్వహిస్తారు. దానికి అనుగుణంగానే 11వ తేదీ ఆన్‌లైన్ టెస్టుకు దరఖాస్తు చేసిన వారిని సర్దుబాటు చేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష ఉదయం 9.30 నుండి 12.30 వరకూ, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకూ నిర్వహిస్తారు.