తెలంగాణ

తెలుగు యూనివర్శిటీ సదుపాయాలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: తెలుగు యూనివర్శిటీలో కల్పించిన సౌకర్యాలు, సదుపాయాలు, యూజీ, పీజీ స్థాయిలో నిర్వహిస్తున్న కోర్సులపై యూజీసీ నియమించిన నేషనల్ అసెస్‌మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నేక్) పీర్ కమిటీ బృందం సంతృప్తిని వ్యక్తం చేసింది. మూడు రోజుల పాటు ఈ కమిటీ తెలుగు యూనివర్శిటీలోని అన్ని శాఖలనూ, పీఠాలను సందర్శించడంతో పాటు వర్శిటీలోని బోధన విధానం, ప్రయోగశాలలు, పరిశోధనలు, వసతి గృహాలు, విద్యార్ధులకు అందించే వౌలిక సౌకర్యాలు పరిశీలించి అంశాలుగా విభజించి వాటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా నివేదికను తయారుచేసి యూజీసీకి సమర్పిస్తుంది. నేక్ పీర్ కమిటీ బృందం అందించే నివేదిక కొలమానంపై గ్రేడ్‌లను కేటాయిస్తారు. నేక్ ఇచ్చే గుర్తింపుపైనే యూజీసీ నిధులు ఆధారపడి ఉంటాయి. ఈ సందర్భంగా వివిధ విభాగాల టీచర్లతోనూ, విద్యార్ధులతోనూ, వివిధ విభాగాల ప్రతినిధులతోనూ చర్చిస్తుంది. తెలుగు వర్శిటీని సందర్శించిన నేక్ బృందానికి చత్తీస్‌ఘ్ఢ్ ఇందిరా కళాసింగీత్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య నమాండవి సింగ్ చైర్‌పర్సన్‌గా, పశ్చిమబెంగాల్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ శృతి బందొపాధ్యాయ కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. బృందంలో బెంగలూరు విశ్వవిద్యాలయానికి చెందిన కొలకలూరి ఆశాజ్యోతి, గ్వాలియర్‌లోని రాజా మాన్‌సింగ్ , మ్యూజిక్ అండ్ డాన్స్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ సాధనా సింగ్, ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ప్రకాశ్ చంద్ర పట్నాయక్‌లు ఉన్నారు. తెలుగు యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ తొలుత యూనివర్శిటీపై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించారు. తదుపరి వర్శిటీ ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఆచార్య జీఎస్ గాబ్రియెల్ వర్శిటీ స్థితి గతులను వివరించారు. ఉదయం వర్శిటీకి చేరుకున్న నేక్ పీర్ కమిటీ బృందం సభ్యులకు వర్శిటీలోని విద్యార్థినీ , విద్యార్ధులు వివిధ సాంస్కృతిక కళారూపాలతో ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్థినులతో బృందంలోని సభ్యులు ఆనందంగా బతుకమ్మ ఆడారు. వర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య అలేఖ్య వారిని స్వాగతించారు. సాయంత్రం వర్శిటీ లలితకళాపీఠం విద్యార్థులు ప్రదర్శించిన శాస్ర్తియ నృత్యం, సంగీతం, జానపద కళాప్రదర్శనలను బృందం సభ్యులు తిలకించారు.
చిత్రం.. తెలుగు యూనివర్శిటీని సందర్శించిన యూజీసీ నియమించిన
నేషనల్ అసెస్‌మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నేక్) పీర్ కమిటీ బృందం