తెలంగాణ

స్మార్ట్ ట్రాఫిక్ సొల్యూషన్స్ కోసం ఓలాతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్ది నిర్వహణకు ప్రభుత్వానికి తోడ్పాటు అందించేలా ఇంటెలిజెంట్ డేటాను పంచుకోవడానికి ప్రపంచంలో అతి పెద్ద రైడ్ హెయిలింగ్ వేదికైన ఓలాతో సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఓలా ప్రతినిధికి, రాష్ట్ర పరిశ్రమలు మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ, రవాణా సంబంధిత పాలనా వ్యవహారాలకు అండగా నిలిచేందుకు అవసరమైన మొబిలిటీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. హైదరాబాద్‌కు సమగ్ర స్మార్ట్ సిటీ ప్లాన్ రూపొందించడంపై తాము దృష్టి సారించామన్నారు. ఓలా అందించే విలువైన డేటా భవిష్యత్ సన్నధ రవాణా వసతులను ఏర్చుకోవడానికి మార్గం సుగమం అవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఓలా రీజినల్ హెడ్ సందీప్ ఉపాధ్యాయ్ పాల్గొన్నారు.