తెలంగాణ

నీటి వృథాను అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, మార్చి 18: నీటిని సమర్థవంతంగా వినియోగించుకొని, నీటి వృథాను అరికట్టాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు సూచించారు. రాష్ట్రంలో భూగర్భ జలాల నిర్వాహణ - ప్రజల భాగస్వామ్యంతో ముందడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పూర్వకాలంలో కుంటలు, బావులలో నీటిని వినియోగించుకొని ప్రజలు జీవనం సాగించేవారని గుర్తు చేశారు. ప్రస్తుత తరుణంలో నీటిని వృథా చేస్తూ భావితరాలకు నీటి నిల్వలు లేకుండా చేస్తున్నామని ఆవేదన చెందారు. నీటి వినియోగంలో ఇతర దేశాలు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తున్నాయన్నారు. మన దేశం లో సైతం నీటి వినియోగం పట్ల విప్లవాన్ని తీసుకువచ్చి అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పూర్వం సగటున ఒక మనిషికి 60 లక్షల లీటర్ల నీరు అందుబాటులో ఉంటే, నేడు కేవలం 13లక్షల లీటర్ల నీరు అందుబాటులో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు సైతం వర్షాకాలంలో వేసే పంటల పట్ల పూర్తి అవగాహనతో వేసుకోవాలని సూచించారు. 90శాతం వ్యవసాయానికి నీరు ఉపయోగిస్తున్నామని గుర్తుచేశారు. దేశంలో వ్యవసాయాన్ని కాపాడుకుంటూనే నీటిని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందని వివరించారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇజ్రాయెల్ దేశమని వివరించారు. ఇజ్రాయెల్‌లో రెండు రకాల పైపులైన్లను ఏర్పాటు చేసుకొని తాగునీటి కోసం వర్షపు నీటిని వినియోగిస్తే, వ్యవసాయానికి మాత్రం మానవ అవసరాలకు ఉపయోగించిన నీటిని వినియోగిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంవీ రామచంద్రుడు వాస న్, అభ్యుదయ రైతు టి.ప్రవీణ్‌కుమార్, ఎన్‌జీవో ఎస్‌వీ గోవర్ధన్‌దాస్, సురేష్‌కుమార్, బీ.కృష్ణారావు, కే.అనిల్‌కుమార్, డాక్టర్ రాజిరెడ్డి, జే.శేష శ్రీనివాస్, ప్రొఫెసర్ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.